
IPL 2020 సీజన్‌లో మరో డామినేటింగ్ విజయంతో టేబుల్ టాప్‌లోకి వెళ్లింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. 149 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ, డి కాక్ కలిసి మొదటి వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
6 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన రోహిత్ శర్మను అవుట్ చేయగా... సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యాతో కలిసి లాంఛనాన్ని ముగించాడు డి కాక్... 16.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన ముంబై, 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది...
డి కాక్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలవగా, హార్ధిక్ పాండ్యా 11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 21 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి, వరుణ్ చక్రవర్తిలకు చెరో వికెట్ దక్కింది. ఈ విజయంతో మరోసారి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది ముంబై ఇండియన్స్.