అటు ఐపిఎల్-ఇటు ప్రపంచ కప్...మధ్యలో మాల్దీవులు: కుటుంబంతో రోహిత్ సరదా

By Arun Kumar PFirst Published May 17, 2019, 4:19 PM IST
Highlights

ఐపిఎల్ 2019 ప్రారంభమైనప్పటి నుండి తీరిక లేకుండా గడిపిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఈ ఐపిఎల్ ముగిసిన తర్వాత వెంటనే కాకుండా ప్రపంచ కప్ జరగనున్న ఇంగ్లాండ్ కు వెళ్లేందుకు టీమిండియా ఆటగాళ్లకు కాస్త సమయం దొరకింది. ఈ ఖాళీ సమయాన్ని కేవలం కుటుంబం కోసమే కేటాయించాలని రోహిత్ భావించినట్లున్నాడు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా భార్య రితికా సర్దేశాయ్, కూతురు సమైరాతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులు ప్లైటెక్కాడు. 

మాలి దీవుల్లోని సముద్ర అందాలను వీక్షిస్తూ రోహిత్ దంపతులు సేదతీరుతున్నారు. బీచుల్లో తమ కూతురితో, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన పోటోలను రోహిత్ వివిధ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా మీడియాతో పంచుకుంటున్నాడు. ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి విశేష స్పందన వస్తోంది. ఆటగాడిగా, కెప్టెన్ గా ఆటలో, భర్తగా, తండ్రిగా  జీవితంలో రోహిత్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

గత 11 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఐపిఎల్ సీజన్ 12 నరాలు తెగే ఉత్కంఠ మధ్య  సాగింది. ప్రతి జట్టు శక్తివంచన లేకుండా పోరాడుతూ ట్రోఫియే  లక్ష్యంగా పోరాడాయి. అయితే చివరకు చెన్నై సూపర్ కింగ్స్ ను ఫైనల్లో ఓడించి ముంంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. దీంతో ఆ జట్టుపైనే కాకుండా ముందుండి నడిపించింన సారథి రోహిత్ శర్మపై కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎంతో ఒత్తిడిని సైతం తట్టుకుని రోహిత్ తీసుకున్న నిర్ణయాలు చాలా బాగా పనిచేశాయి.  కేవలం కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా అతడు రాణించాడు. ఇలా రెండు నెలల కష్టానికి ప్రతిఫలంగా ముంబైకి ఐపిఎల్ ట్రోపీ లభించింది. 

ఇలా విశ్రాంతి లేకుండా గడిపిన రోహిత్ కాస్త సేదతీరడం మంచిదే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ప్రపంచ కప్ కోసం  బరిలోకి దిగుతున్న భారత జట్టులో రోహిత్ ఓపెనర్ గా రాణించడం చాలా కీలకం. కాబట్టి ఈ మెగా టోర్నీకి ముందు కుటుంబంతో సరదాగా గడపడం వల్ల రిప్రెష్ అవుతాడు. కాబట్టి మంచి ఊపుతో ప్రపంచ కప్ లో బరిలోకి దిగుతాడని...అది టీమిండియాకు కలిసొస్తుందని వారు అభిప్రాయపడ్డారు. 

Home away from home. Absolutely stunning #WMaldives

A post shared by Rohit Sharma (@rohitsharma45) on May 15, 2019 at 11:30pm PDT

click me!