
టీమిండియా క్రికెటర్లు శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు మంచి ఓపెనింగ్ జోడీ అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరు కేవలం ఆన్ ఫీల్డ్ లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్ లోనూ మంచి స్నేహితులు. తాజాగా తన మిత్రుడు రోహిత్ ను సరదాగా ఆటపట్టిస్టున్న వీడియోను ధవన్ తన ఇన్ట్సాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఎప్పుడూ తన సహచరులతో సరదాగా వుంటూ ఆటపట్టించే ధవన్ తాజాగా తమ మిత్రున్నే ఆటపట్టిస్తూ నెటిజన్లను సరదాగా నవ్వించాడు.
దక్షిణాఫ్రికాతో మొహాలీ వేదికన జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఇక చివరి టీ20 మ్యాచ్ ఆదివారం బెంగళూరులో జరగనుంది. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా గురువారమే మొహాలీ నుండి బెంగళూరుకు బయలుదేరారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తన చిన్నారి కూతురు కోసం కొన్ని ఆటవస్తులను తీసుకున్నాడు.
ఇవి ధవన్ కంట పడ్డాయి. ఇంకేముంది అతడు రోహిత్ ను ఆటపట్టిస్తూ ఓ వీడియోను రూపొందించి ఇన్ట్సాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. మొహాలీ నుండి బెంగళూరుకు వెళుతున్న ప్లైట్ లో రోహిత్, ధవన్ లు పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా బ్యాగులో ఆటవస్తువులు సర్దుకుంటున్న రోహిత్ ను ధవన్ ఆటపట్టించాడు.
అయితే నేనొక్కడినే కాదు జడేజా కూడా చాలా ఆటవస్తువులను తీసుకొస్తున్నాడని రోహిత్ తెలిపాడు. దీంతో ధవన్ కాస్సేపు అతడిని ఆటపట్టించాడు. ఇలా వారిద్దరిని జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను ధవన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. '' భారత ఆటగాళ్ళలో లవింగ్, కేరింగ్ ఫాదర్స్ వీరిద్దరే'' అంటూ ధవన్ ఓ కామెంట్ ను జతచేశాడు. ఈ సరదా వీడియో అభిమానులకు తెగ నచ్చడంతో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు టీ20 సీరిస్ లో ఇప్పటికే రెండు మ్యాచులు పూర్తయ్యియి. అందులో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా రెండో దాంట్లో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఆదివారం బెంగళూరు వేదికన జరగనున్న చివరి మ్యాచ్ సీరిస్ విజయాన్ని నిర్ణయించనుంది.