రోజుకు 200.. మ్యాచ్ ఫీజు 1,500.. భారత్ కు తొలి ప్రపంచకప్ అందించిన జట్టు వేతనమది.. మరి ఇప్పుడో..?

Published : Dec 23, 2021, 07:06 PM ISTUpdated : Dec 23, 2021, 07:18 PM IST
రోజుకు 200.. మ్యాచ్ ఫీజు 1,500.. భారత్ కు తొలి ప్రపంచకప్ అందించిన జట్టు వేతనమది.. మరి ఇప్పుడో..?

సారాంశం

83 Movie: భారత్ కు తొలి వన్డే ప్రపంచకప్ ను అందించి విశ్వ వేదికపై  మువ్వన్నెల జెండాను సగర్వంగా రెపరెపలాడించి దేశంలో క్రికెట్ అభివృద్ధికి భీజాలు వేసిన నాటి క్రికెటర్ల జీతాలను చూస్తే  మన కళ్లను మనమే నమ్మలేం.

భారత టెస్టు క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ ప్రతి యేటా ఎంత సంపాదిస్తాడో తెలుసా..? బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, సోషల్ మీడియా.. ఇలా ఏది ముట్టినా విరాట్ కు భారీగా చెల్లించాల్సిందే. అవన్నీ కలిపితే సుమారు నూట యాభై కోట్ల పైమాటే.. సరే.. ఇవన్నీ పక్కనపెట్టినా ఐపీఎల్ ద్వారా ప్రతి ఏడాది విరాట్ కు దక్కుతున్న వేతనం రూ. 15 కోట్లు.. (మొన్నటిదాకా అది రూ. 17 కోట్లు).. ఒక్క విరాటే కాదు.. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని,  రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తున్నారు. కానీ ఒక్కసారి 1983కు వెళ్దాం. భారత్ కు తొలి వన్డే ప్రపంచకప్ ను అందించి విశ్వ వేదికపై  మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి  దేశంలో క్రికెట్ అభివృద్ధికి భీజాలు వేసిన  క్రికెటర్ల జీతాలు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ. 1,700. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం.. భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లతో పాటు టీమిండియాలోని ప్రతి ఆటగాడి రోజూవారీ వేతనం అదే..

1983 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా.. వన్డే  వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 83. బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాకు మంచి టాక్ వినిపించింది. ఈ సినిమా విడుదల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 

మూడు రోజులకు  రూ. 2,100 

ప్రముఖ క్రీడా జర్నలిస్టు మకరంద్ వైంగాంకర్.. 1983 వరల్డ్ కప్ హీరోల వేతనాలకు సంబంధించిన కీలక పత్రాన్ని తన ట్విట్టర్ లో పంచుకున్నారు. దాని ప్రకారం  కపిల్ సేనకు  రోజుకు రూ. 200 అలవెన్సు, మ్యాచ్ ఫీజుగా రూ. 1,500 దక్కాయి. అంటే మూడు రోజులకు గాను భారత జట్టులోకి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్నాథ్, కె.శ్రీకాంత్, రవిశాస్త్రి, సందీప్ పాటిల్, యశ్పాల్ శర్మ, కృతి ఆజాద్, రోజర్ బిన్ని, మదన్ లాల్, సయీద్ కిర్మాణీ, బి.సంధు, దిలీప్ వెంగ్సర్కార్, సునీల్ విల్సన్ లకు మూడు రోజులకు రూ. 2,100 (ఒక్కొక్కరికి)  అందాయి. 

 

లతా మంగేష్కర్ కచేరితో సాయం.. 

ఇప్పుడంటే ప్రపంచంలోనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అత్యంత సంపన్నమైన బోర్డు.  ప్రపంచ క్రికెట్ ను కనుసైగతో శాసిస్తున్నది.  త్వరలో జరుగబోయే ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల  ద్వారా వచ్చే మొత్తం డబ్బు, ప్రస్తుతం దాని దగ్గర ఉన్నదంతా కలిపి రూ. 50 వేల కోట్లు ఆదాయం వస్తుందని స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడే చెబుతున్నాడు.  అలాంటి బీసీసీఐ.. ఒకప్పుడు ఆటగాళ్లకు సత్కారం చేయడానికి కూడా నిధులు సేకరించిందన్న విషయం ఎంత మందికి తెలుసు..? 

అవును... ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లకు సత్కారం చేయడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దగ్గర డబ్బులు లేకుంటే ప్రముఖ గాయని  లతా మంగేష్కర్ తో ఓ సంగీత కచేరి చేయించి వచ్చిన నిధులతో వారిని సత్కరించారు. ఆ షో ద్వారా వచ్చిన డబ్బులో ఒక్కొక్కరికి లక్ష రూపాయల సాయం చేసింది బీసీసీఐ.  

మరి ఇప్పుడో...?

 

- ఒక్క టెస్టు మ్యాచ్ ఆడితే భారత క్రికెటర్ కు ఆడితే వచ్చే మొత్తం రూ. 15 లక్షలు. 
- వన్డే మ్యాచ్ ఆడితే రూ. 6 లక్షలు. టీ20 అయితే రూ. 3 లక్షలు. 
- బోర్డుతో ఏ+ కాంట్రాక్టు దక్కించుకున్న ఆటగాడికి ప్రతి ఏటా రూ. 7 కోట్లు. ఏ, బీ గ్రేడ్ ఆటగాళ్లకు వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు దక్కుతాయి. సీ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి కోటి రూపాయలు  అందుతాయి. 
- ఒక  మ్యాచులో డబుల్ సెంచరీ కొడితే రూ. 7 లక్షలు అదనం.
- 5 వికెట్ల ప్రదర్శన చేసినా.. టెస్టులలో సెంచరీ కొట్టినా రూ. 5 లక్షలు.  
- ఇక వీటితో పాటు ఐపీఎల్ కాంట్రాక్టులు.. యాడ్స్.. బ్రాండ్ ప్రమోషన్లు.. 

1983 జట్టుకు రాయల్టీ...? 

83 సినిమా ద్వారా కపిల్ సేన కష్టాలను  దేశానికి చూపించిన చిత్ర నిర్మాతలు.. ఈ సినిమా తీయడానికి గాను ప్రపంచకప్ జట్టు సభ్యులకు రాయల్టీగా చెల్లించారట. ఇందులో రూ. 5 కోట్లు  అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ కు దక్కగా.. మిగిలిన రూ. 10 కోట్లను తక్కిన 13 మంది ఆటగాళ్లకు అందించినట్టు సమాచారం.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?