KXIP vs RCB: పంజాబ్ సూపర్ విక్టరీ... చిత్తుగా ఓడిన కోహ్లీ సేన...

Published : Sep 24, 2020, 11:00 PM ISTUpdated : Sep 24, 2020, 11:12 PM IST
KXIP vs RCB: పంజాబ్ సూపర్ విక్టరీ... చిత్తుగా ఓడిన కోహ్లీ సేన...

సారాంశం

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైన కోహ్లీ టీమ్... 13వ సీజన్‌లో ఆర్‌సీబీకి తొలి పరాజయం... గ్రాండ్ విక్టరీతో కమ్ బ్యాక్ ఇచ్చిన పంజాబ్...

IPL 2020: ఐపీఎల్ 2020లో మరోసారి తన పూర్వపు ఆటను గుర్తుకుతెచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫీల్డింగ్, బౌలింగ్‌ విభాగాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆర్‌సీబీ, చెత్త బ్యాటింగ్‌తో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 207 భారీ లక్ష్యచేధనలో 17 ఓవర్లలో పరుగులు మాత్రమే చేసి109 ఆలౌట్ అయ్యింది బెంగళూరు. 

ఓపెనర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫలం కావడంతో 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది బెంగళూరు. ఆ తర్వాత ఆరోన్ ఫించ్, ఏబీ డివిల్లియర్స్ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపిన ఈ ఇద్దరూ అవుటైన తర్వాత బెంగళూరు ఓటమిని ఖరారు చేసుకుంది. 

30 పరుగులతో వాషింగ్టన్ సుందర్ హై స్కోరర్‌గా నిలవగా ఫించ్ 20 పరుగులు చేయగా, ఏబీ డివిల్లియర్స్ 28 పరుగులు చేశాడు. శివమ్ దూబే 12 పరుగులు చేయగా ఉమేశ్ యాదవ్ డకౌట్ అయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ ఒక్కడే 132 పరుగులు చేయగా ఆర్‌సీబీ మొత్తం జట్టు 109 పరుగులకే పరిమితమైంది. 

అండర్ 19 యంగ్ సెన్సేషన్ రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్‌ల‌కి మూడు వికెట్లు దక్కగా కాంట్రెల్ 2, షమీ, మ్యాక్స్‌వెల్ తలా ఓ వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?