కోహ్లీ-రహానే జోడీ అరుదైన ఘనత: సచిన్-గంగూలీల రికార్డు బద్దలుగొట్టి

By Arun Kumar PFirst Published Aug 25, 2019, 5:25 PM IST
Highlights

ఆంటిగ్వా టెస్ట్ ద్వారా కెప్టెన్ కోహ్లీ-వైస్ కెప్టెన్ రహానేల జోడీ ఓ అరుదైన రికార్డును సొంత చేసుకుంది. టీమిండియా దిగ్గజాలు సచిన్-గంగూలీ ల పేరిట వున్న రికార్డును వీరు బద్దలుగొట్టారు.  

ఆంటిగ్వా వేదికన జరుగుతున్న మొదటి టెస్ట్ లో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. వెస్టిండిస్ పై అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ కోహ్లీసేన స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే రెండో ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతున్నాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టును  గెలుపు దిశగా నడిపిస్తున్నాడు. ఇలా కెప్టెన్, వైస్ కెప్టెన్ల జోడీ టీమిండియాను విజయానికి చేరువచేయడమే కాదు ఓ అరుదైన రికార్డును కూడా నమోదు చేసుకుంది. 

మూడో రోజు వెస్టిండిస్ ను 222 పరుగులకే విండీస్ ను ఆలౌట్ చేసి కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్ ను ఆరంభింది.  ఈ క్రమంలో ఓపెనర్ కెఎల్ రాహుల్(38 పరుగులు), చటేశ్వర్ పుజారా(25 పరుగులు) పరవాలేదనిపించినా అగర్వాల్(16 పరుగులు) మాత్రం మరోసారి నిరాశపర్చాడు. ఇలా 81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి  మెల్లిగా కష్టాల్లోకి జారుకుంటున్న జట్టును కోహ్లీ-రహానేల జోడీ సెంచరీ(104 పరుగులు) భాగస్వామ్యంతో ఆదుకుంది. దీంతో మూడో రోజు ఆటముగినే సమయానికి భారత్ 185/3 పటిష్టస్థితిలో నిలిచింది.

అయితే ఇలా సెంచరీ భాగస్వామ్యంతో అదరగొట్టిన కోహ్లీ-రహానేల జోడీ ఓ అరుదైన ఘనతను సాధించింది. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ జోడీ గతంలో నెలకొల్పిన రికార్డును వీరి విజృంభణలో బద్దలయ్యింది. ఇంతకు ముందువరకు భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలను సచిన్-గంగూలీల జోడీ నెలకొల్పింది. వీరు ఏడుసార్లు సెంచరీ పైచిలుకు భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఇలా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల రికార్డు ఇంతకాలం వీరిపేరిట వుంది.

తాజాగా ఆ రికార్డును కోహ్లీ-రహానేల జోడి బద్దులుగొట్టింది. ఇంతకుముందే ఏడు సెంచరీ భాగస్వామ్యాలతో సచిన్-గంగూలీలతో సమానంగా నిలిచిన ఈ జోడీ తాజా భాగస్వామ్యంతో వారిని వెనక్కినెట్టారు. భారత్ తరపుప నాలుగో వికెట్ కు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు(ఎనిమిది) సాధించిన జోడీగా కోహ్లీ-రహానే లు మొదటిస్ధానాన్ని కైవసం చేసుకోగా సచిన్-గంగూలీల జోడీ రెండో స్థానానికి పడిపోయింది. 

మూడో నోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 185/3 స్కోరు వద్ద నిలిచింది.  కోహ్లీ 51 పరుగులు, రహానే 53 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. దీంతో వెస్టిండిస్ పై భారత్ ఇప్పటికే 260 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 
 

click me!