నేషనల్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ (నాడా) ఐదుగురు భారత క్రికెటర్లకు నోటీసులు జారీ చేసింది. కెఎల్ రాహుల్, చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా సహా మహిళా క్రికెటర్లు స్మృతీమంధాన, దీప్తి శర్మలకు నాడా నోటీసులు ఇచ్చింది.
నేషనల్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ (నాడా) ఐదుగురు భారత క్రికెటర్లకు నోటీసులు జారీ చేసింది. కెఎల్ రాహుల్, చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా సహా మహిళా క్రికెటర్లు స్మృతీమంధాన, దీప్తి శర్మలకు నాడా నోటీసులు ఇచ్చింది.
గత మూడు నెలలుగా ఎక్కడ ఉంటున్నారనే సమాచారాన్ని ఈ ఐదుగురు క్రికెటర్లు నాడాకు తెలిపలేదు. దీంతో నేషనల్ రిజస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఎన్‌ఆర్‌టీపీ)కి 110 మంది క్రికెటర్లను బీసీసీఐ రిజిస్టర్ చేసింది.
undefined
నోటీసులకు స్పందిస్తూ బీసీసీఐ వివరణ ఇచ్చిందని, సమావేశంలో చర్చించిన తర్వాత తుదుపరి నిర్ణయం తీసుకుంటామని నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. క్రికెటర్లు తాము ఎక్కడ ఉంటున్నారనే సమాచారం రెండు విధాలుగా సమర్పించవచ్చని, యాంటీ డోపింగ్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో అథ్లెట్లు నేరుగా వివరాలు అందించవచ్చు, లేదంటే అసోసియేషన్ అథ్లెట్ల తరఫున వివరాలు అందజేయవచ్చని వారు తెలిపారు.
క్రికెటర్లు పాస్‌వర్డ్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నారని, అందుకే ఈ సదరు 5గురు క్రికెటర్లు తాము ఎక్కడ ఉన్నాము అన్న వివరాలను పొందుపర్చలేకపోయారని బీసీసీఐ లేఖలో వివరణ ఇచ్చింది.
ఈ ఐదుగురు క్రికెటర్లు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని, సమావేశంలో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని అగర్వాల్ అన్నాడు. సాధారణంగా క్రికెటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అసోసియేషన్ వాటిని సబ్మిట్ చేస్తారు.
ఈ 5గురు క్రికెటర్లకు సంబంధించి పాస్ వర్డ్ సమస్య ఎదుర్కొంది బీసీసీఐ. దానితో అసోసియేషన్ ఈ అయిదుగురు క్రికెటర్ల పేర్లను, వివరాలను పొందు పర్చలేకపోయారు. కాకపోతే ఇక్కడొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఐదుగురికి సంబంధించిన సమస్య ఎదురైనప్పుడు ప్లేయర్స్ నే నేరుగా వారి వారి డీటెయిల్స్ సబ్మిట్ చేయమని చెబితే అయిపోయేది కదా అని అంటున్నారు సీనియర్లు.
మూడు నెలలుగా ఇండ్లకే పరిమితమయ్యారు. మామూలు సందర్భాల్లోనన్నా వారు క్రికెఎస్ ఆడుతూ బిజీగా ఉంటారు కాబట్టి బీసీసీఐ నింపింది. ఇప్పుడంతా ఖాళీగా తమ తమ ఇండ్లలోనే ఉన్నారు. ఖాళీగా ఉంటూ ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో లైవ్ షోలలో పాల్గొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనయినా వారికి ఆ పని అప్పగించొచ్చు కదా అని అంటున్నారు.