కేఎల్ రాహుల్ ఫోటోకి అతియా శెట్టి రియాక్షన్ చూశారా..?

Published : Dec 25, 2020, 08:43 AM ISTUpdated : Dec 25, 2020, 08:48 AM IST
కేఎల్ రాహుల్ ఫోటోకి అతియా శెట్టి రియాక్షన్ చూశారా..?

సారాంశం

 కేఎల్ రాహుల్.. మెల్ బోర్న్ లో దిగిన రెండు ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి మెల్ బోర్న్ ఆర్కివ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

టీమిండియా క్రికెటర్ కే ఎల్ రాహుల్ కి బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి కి మధ్య ఏదో నడుస్తుందంటూ గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లారంటూ కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే.. ఎన్ని వార్తలు వచ్చినా.. ఈ ఇద్దరు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వలేదు.  అయితే.. తాజాగా.. మరోసారి వీరి బంధం గురించి వార్తలు మొదలయ్యాయి. అందుకు రాహుల్.. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలే కారణం.

ఇంతకీ మ్యాటరేంటంటే.. కేఎల్ రాహుల్.. మెల్ బోర్న్ లో దిగిన రెండు ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి మెల్ బోర్న్ ఆర్కివ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే.. దానికి అతియా శెట్టి ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ ఫోటోకి ఆమె హార్ట్ సింబల్ రిప్లేగా ఇచ్చింది.  దీంతో.. వీరిద్దరి మధ్య రిలేషన్ కన్ఫామ్ అంటూ అందరూ బలంగా నమ్ముతున్నారు. మరి ఈ సారైనా వీరిద్దరిలో ఒక్కరైనా నోరు విప్పుతారేమో చూడాలి.

ఇదిలా ఉండగా.. కేఎల్ రాహుల్ కి కేవలం అతియా తో నే కాకుండా.. పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అందులో నిధి అగర్వాల్ కూడా ఉండటం గమనార్హం. 


 

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !