KKRvsKXIP: శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముందు ఈజీ టార్గెట్...

Published : Oct 26, 2020, 09:13 PM IST
KKRvsKXIP: శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముందు ఈజీ టార్గెట్...

సారాంశం

శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... 40 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్... 3 వికెట్లు తీసిన మహ్మద్ షమీ...  

IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా డకౌట్ కాగా రాహుల్ త్రిపాఠి 7 పరుగులు, దినేశ్ కార్తీక్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.

10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ను శుబ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కి 81 పరుగులు జోడించిన తర్వాత మోర్గాన్ అవుట్ అయ్యాడు. మోర్గాన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేయగా సునీల్ నరైన్ 6, కమ్లేశ్ నాగర్‌కోటి 6, ప్యాట్ కమ్మిన్స్ 1 పరుగుకే అవుట్ అయ్యారు.

శుబ్‌మన్ గిల్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుట్ కాగా... ఫర్గూసన్ 13 బంతుల్లో 24 పరుగులు చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా రవి బిష్ణోయ్, జోర్డార్ రెండేసి, మ్యాక్స్‌వెల్, మురుగున్ అశ్విన్, జోర్డాన్‌లకు తలా ఓ వికెట్ దక్కాయి. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !