ఒకే ఓవర్ లో 26 పరుగులు... మ్యాచ్ ని టర్న్ చేసిన క్రిస్ గేల్

By telugu news teamFirst Published Oct 21, 2020, 9:34 AM IST
Highlights

ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌కిరాగా.. క్రిస్‌గేల్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. తొలి రెండు బంతుల్ని ఫోర్లుగా మలిచిన గేల్.. ఆ తర్వాత మళ్లీ సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టేశాడు. 

ఐపీఎల్ 2020 సీజన్ లో విధ్వంసకర ఆటగాటు క్రిస్ గేల్.. చాలా ఆలస్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా.. ఆలస్యంగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆటలో మాత్రం అదరగొడుతున్నాడు.  దుబాయి వేదికగా  మంగళవారం రాత్రి పంజాబ్, ఢిల్లీ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ ని మొత్తం టర్న్ చేసింది మాత్రం క్రిస్ గేల్ అనే చెప్పొచ్చు.

2తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. ఛేదనలో పంజాబ్ టీమ్ 2.2 ఓవర్లు ముగిసే సమయానికి 17/1తో నిలిచిన దశ‌లో క్రిస్‌గేల్ క్రీజులోకి వచ్చాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌కిరాగా.. క్రిస్‌గేల్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. తొలి రెండు బంతుల్ని ఫోర్లుగా మలిచిన గేల్.. ఆ తర్వాత మళ్లీ సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టేశాడు. 

దాంతో.. ఒత్తిడికి గురైన తుషార్ ఆరో బంతిని వైడ్ రూపంలో విసరగా.. చివరి బంతికి గేల్ సింగిల్ తీశాడు. మొత్తంగా.. ఆ ఓవర్‌లో 4, 4, 6, 4, 6, Wd, 1 రూపంలో మొత్తం 26 పరుగులు వచ్చాయి. 

అప్పటి వరకు ఢిల్లీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. శిఖర్ ధావన్ సెంచరీ చేయడంతో ఢిల్లీ విజయం సాధించడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. మ్యాచ్ ని క్రిస్ గేల్ టర్న్ తిప్పాడు. దీంతో.. పంజాబ్ విజయం సాధించింది.

click me!