
ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించడంతో మొదలైన ఆర్‌సీబీ విజయాల ప్రస్థానం, వరుసగా సన్‌రైజర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించేదాకా సాగింది.
గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఆర్‌సీబీ ఆటతీరుపై కన్నడ సూపర్ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ ప్రశంసిస్తూ ట్వీట్ వేశారు.
‘ఆర్‌సీబీ గొప్ప పర్ఫామెన్స్‌ను చూస్తున్నా. నాలుగింట్లో నాలుగు గెలిచాం. అద్భుతంగా ఉంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుతుంది. విరాట్ కోహ్లీకి బెస్ట్ విషెస్. నిస్వార్థమైన ఆటతీరుతో అద్భుతమైన లీడర్‌గా మరోసారి నిరూపించుకున్నావు. దేవ్‌దత్ పడిక్కల్ హ్యాట్సాఫ్... మరోసారి నువ్వు ఛాంపియన్‌వని నిరూపించావ్... తర్వాతి మ్యాచ్‌లో మరింత బలంగా రండి... ఛీర్స్’ అంటూ ట్వీట్ చేశాడు సుదీప్.