Jos Buttler: బాబూ బట్లరూ.. దానిని కూడా వదలవా..? నీ దాహానికి అంతే లేదా..?

Published : Jun 23, 2022, 11:28 AM IST
Jos Buttler: బాబూ బట్లరూ.. దానిని కూడా వదలవా..? నీ దాహానికి అంతే లేదా..?

సారాంశం

NED vs ENG: పసికూన నెదర్లాండ్స్ పై కసి లేకుండా బాదుతున్నాడు ఇంగ్లాండ్ వన్డే వైస్ కెప్టెన్ జోస్ బట్లర్. తొలి వన్డేలో దుమ్ము రేపిన ఈ ఇంగ్లీష్ బ్యాటర్ తాజాగా మూడో వన్డేలో కూడా అదే రీతిలో చెలరేగిపోయాడు.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో సూపర్ ఫామ్ తో రాజస్తాన్ రాయల్స్ ను ఫైనల్స్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తాను బ్యాటింగ్ లో ఉన్నప్పుడు అవతలి ఎండ్ లో ఉన్న బౌలర్ ఎవరు..? అతడు వేసేది గుడ్ లెంగ్త్ బంతా లేక డెడ్ బాలా, నో బాలా అన్నది చూడకుండా బాదుతున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా అనుభవం లేని నెదర్లాండ్స్ మీద  బట్లర్  దయ, జాలి, కరుణ అనేదే లేకుండా జోరు చూపిస్తున్నాడు.

నెదర్లాండ్స్ తో బుధవారం ముగిసిన మూడో వన్డేలో పాల్ వన్ మీక్రిన్ ఇన్నింగ్స్ 29వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బాల్ ను షార్ట్ పిచ్ బాల్ గా సంధించే క్రమంలో బ్యాలెన్స్ తప్పాడు. బంతి కాస్తా స్లో అయి  క్రీజు పక్కకు పోయింది.  సాధారణంగా ఏ బ్యాటర్ అయినా దానిని వదిలిపెడతాడు.  కానీ అక్కడుంది బట్లర్. 

పరుగుల దాహానికి మరిగిన పులిలా ఉన్న బట్లర్.. డెడ్ బాల్ ను కూడా వదల్లేదు. క్రీజు  నుంచి పక్కకు జరిగి అప్పటికే రెండు సార్లు బౌన్స్ అయిన బంతిని  లెగ్ సైడ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. అంపైర్ ఈ బంతిని డెడ్ బాల్ గా పరిగణించడంతో  పాటు ఫ్రీ హిట్ సిగ్నల్  ఇచ్చాడు. ఆ తర్వాత బంతిని కూడా బట్లర్.. స్టాండ్స్ ఆవల ఉంచాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

 

ఇదిలాఉండగా నెదర్లాండ్స్ తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్..  49.2 ఓవర్లలో 244 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. 30.1 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ జేసన్ రాయ్ (101), ఫిలిప్ సాల్ట్ (49) లు  దూకుడుగా ఆడారు. వన్ డౌన్ లో వచ్చిన డేవిడ్ మలన్ (0) డకౌటైనా.. ఆ తర్వాత వచ్చిన బట్లర్.. 64 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో ఏకంగా 86 పరుగులు చేశాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను 3-0తో  క్లీన్ స్వీప్ చేసింది. 

 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?