నిరసనకారుడిని ఎత్తి పడేసిన బెయిర్ స్టో.. పిచ్ నుంచి బౌండరీ లైన్ దాకా మోస్తూ అసహనం

Published : Jun 28, 2023, 05:06 PM IST
నిరసనకారుడిని ఎత్తి పడేసిన బెయిర్ స్టో..  పిచ్ నుంచి బౌండరీ లైన్ దాకా మోస్తూ అసహనం

సారాంశం

Ashes 2023: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో.. యాషెస్ రెండో టెస్టులో భాగంగా   ఓ నిరసనకారుడిని  ఫీల్డ్ నుంచి ఎత్తుకుని  బౌండరీ లైన్ ఆవల పడేశాడు.   

ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య   నేటి నుంచి లార్డ్స్ వేదికగా  మొదలైన రెండో టెస్టులో భాగంగా తొలి రోజు  ఆట ఆరంభంలోనే  ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభమై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్‌కు రాగా.. అండర్సన్ తొలి ఓవర్ వేశాడు.  అండర్సన్ ఓవర్ ముగిసిన తర్వాత వెంటనే  పలువురు నిరసనకారులు  పిచ్ వద్దకు దూసుకువచ్చారు.   పిచ్ పై  ఆరెంజ్ కలర్ లో ఉన్న  ఓ రంగు  పిండిని చల్లుతూ  మ్యాచ్ కు అంతరాయం కలిగించారు.  

వీళ్లంతా ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ కార్యకర్తలు.  ఇదొక పర్యావరణ పరిరక్షణ సంస్థ వంటిది.  గత ఏడాది కాలంగా  వీళ్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే లార్డ్స్ లో కూడా  ఇలాగే మ్యాచ్ కు ఆటంకం కలిగించారు.  

అండర్సన్ ఓవర్ ముగిసిన తర్వాత వీళ్లు పిచ్ మధ్యలోకి వచ్చి  నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో  ఓ నిరసనకారుడిని   చేతులతో  అమాంతం ఎత్తుకుని  అతడిని మెయిన్ పిచ్ నుంచి  బౌండరీ లైన్ ఆవల దాకా అలాగే తీసుకొచ్చి పడేశాడు.  ఈ సందర్భంగా బెయిర్ స్టో ముఖంలో  అసహనం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.  

 

ఎవరీ నిరసనకారులు..? 

‘జస్ట్ స్టాప్ ఆయిల్’ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న ఓ గ్రూపు .    ఈ గ్రూపు  ఇంగ్లాండ్ లో   2022 మార్చి నుంచి ఉద్యమిస్తోంది.  యూకేలో ఇంధన సంస్థలకు అడ్డగోలుగా లైసెన్సులు ఇవ్వడాన్ని ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ వ్యతిరేకిస్తున్నది.  అంతేగాక 2025 నాటికి  కొత్తగా  మరో 100కి పైగా ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులను తీసుకురావాలని  యూకే  ప్రభుత్వం చూడటం కూడా వీరికి ఆగ్రహం కలిగిస్తున్నది. ఇలా విచ్చలవిడిగా  ఆయిల్ కంపెనీలకు అనుమతులిచ్చుకుంటూ పోతే అది పర్యావరణానికి తీవ్ర హాని చేసే అవకాశం ఉందని   ఆందోళన వ్యక్తం చేస్తూ గత కొంతకాలంగా  ఈ గ్రూపునకు చెందిన ఉద్యమాకారులు నిరసనలకు దిగుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !