కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన సూపర్ నోవాస్... స్మృతి జట్టు ముందు భారీ టార్గెట్...

Published : Nov 07, 2020, 09:14 PM IST
కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన సూపర్ నోవాస్... స్మృతి జట్టు ముందు భారీ టార్గెట్...

సారాంశం

67 పరుగులు చేసిన ఆటపట్టు...  31 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్... 30 పరుగులు చేసిన ప్రియా పూనియా...

JIO వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్... భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది సూపర్ నోవాస్. ఓపెనర్లు ప్రియా పూనియా, చమేరీ ఆటపట్టు దూకుడుగా ఆడి మొదటి వికెట్‌కి 89 పరుగులు జోడించారు.

ప్రియా పూనియా 30 పరుగులు చేయగా, ఆటపట్టు 48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసింది. యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 1 పరుగుకే అవుట్ కాగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 31 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ఏకంగా ముగ్గురు బ్యాట్స్‌వుమెన్ రనౌట్ అయ్యారు.

స్మృతి మంధాన నాయకత్వంలోని ట్రైయల్ బ్లేజర్స్... ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సూపర్ నోవాస్ ఫైనల్‌కి అర్హత సాధించదు.

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?