ఇషాన్ కిషన్ హ్యాట్రిక్... మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ, శుబ్‌మన్ గిల్‌తో కలిసి...

Published : Aug 01, 2023, 08:09 PM ISTUpdated : Aug 01, 2023, 08:25 PM IST
ఇషాన్ కిషన్ హ్యాట్రిక్... మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ, శుబ్‌మన్ గిల్‌తో కలిసి...

సారాంశం

వరుసగా మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. శుబ్‌మన్ గిల్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యం... 

వెస్టిండీస్ టూర్‌లో ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కించుకున్న భారత యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. హ్యాట్రిక్ కొట్టాడు. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్.. వరుసగా మూడో వన్డేలోనూ 50+ స్కోరు నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఇషాన్ కిషన్‌కి ఇది వరుసగా నాలుగో 50+ స్కోరు...

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ అందుకున్న ఇషాన్ కిషన్, మూడో వన్డేలో 43 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రెండో వన్డేలో తొలి వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం జోడించిన శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్... మూడో వన్డేలో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. 

వెస్టిండీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. ఇంతకుముందు వరుసగా రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ రికార్డును ఇషాన్ కిషన్ అధిగమించాడు. ఓవరాల్‌గా వెస్టిండీస్ గడ్డ మీద ధోనీ, మూడు సార్లు 50+ స్కోర్లు సాధిస్తే, ఇషాన్ కిషన్ ఆ ఫీట్‌ని సమం చేసేశాడు.. 

వన్డే సిరీస్‌లో మూడు వన్డేలోనూ 50+ స్కోర్లు చేసిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. కృష్ణమాచారి శ్రీకాంత్ 1982లో శ్రీలంకపై ఈ ఫీట్ సాధిస్తే, 1985లో దిలీప్ వెంగ్‌సర్కార్, 1993లో మహ్మద్ అజారుద్దీన్ కూడా శ్రీలంకపైనే హ్యాట్రిక్ 50+ స్కోర్లు సాధించారు. 2019లో మహేంద్ర సింగ్ ధోనీ, ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధిస్తే, 2020లో శ్రేయాస్ అయ్యర్, న్యూజిలండ్‌పై హ్యాట్రిక్ 50+ స్కోర్లు చేశాడు.

మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్, 51 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వెస్టిండీస్‌ టూర్‌లో వరుసగా విఫలమవుతున్న గిల్‌కి ఇది ఊరటనిచ్చే అర్ధశతకం. 

18 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 128 పరుగులు చేసింది టీమిండియా. అంతకుముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలో దిగి భారీ మూల్యం చెల్లించుకున్న టీమిండియా, మూడో వన్డేలోనూ అదే ప్రయోగాన్ని కొనసాగించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలో దిగిన భారత జట్టు, ఉమ్రాన్ మాలిక్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కి తుది జట్టులో అవకాశం ఇచ్చింది. అక్షర్ పటేల్ ప్లేస్‌లో జయ్‌దేవ్ ఉనద్కట్ టీమ్‌లోకి వచ్చాడు..

అప్పుడెప్పుడో 2013లో చివరి వన్డే ఆడిన జయ్‌దేవ్ ఉనద్కట్, దాదాపు దశాబ్దం తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు రెస్ట్ ఇవ్వడంతో 2013లో జయ్‌దేవ్ ఉనద్కట్ ఆడిన ఆఖరి వన్డేలో ఆడిన వారిలో రవీంద్ర జడేజా ఒక్కడే నేటి మ్యాచ్‌లో ఆడుతుండడం మరో విశేషం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !