INDvsWI 3rd ODI: టాస్ గెలిచిన వెస్టిండీస్.. డిసైడర్ మ్యాచ్‌లోనూ రోహిత్, కోహ్లీ లేకుండా..

Published : Aug 01, 2023, 06:38 PM ISTUpdated : Aug 01, 2023, 06:48 PM IST
INDvsWI 3rd ODI: టాస్ గెలిచిన వెస్టిండీస్.. డిసైడర్ మ్యాచ్‌లోనూ రోహిత్, కోహ్లీ లేకుండా..

సారాంశం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి టీమిండియా.. 

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ వేదికలో ఇదే మొట్టమొదటి వన్డే మ్యాచ్. తొలి వన్డేలో ఆడినా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాల కారణంగా విరాట్ కోహ్లీకి బ్యాటింగ్‌  రాలేదు. రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ రెస్ట్ ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. ఫలితంగా భారత జట్టు, రెండో వన్డేలో చిత్తుగా ఓడింది. వెస్టిండీస్‌లో 10 వన్డేల తర్వాత టీమిండియాకి ఎదురైన మొదటి పరాజయం ఇదే. 

రెండో వన్డేలో ఓడిన తర్వాత కూడా టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయోగాలకే ప్రాధాన్యం ఇచ్చింది. మూడో వన్డేలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే బరిలో దిగుతోంది భారత జట్టు. 

ఇషాన్ కిషన్‌కి రెండు వన్డేల్లోనూ మంచి ఆరంభం దక్కినా దాన్ని భారీ స్కోర్లుగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ వరకూ బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతున్నాడు..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు శుబ్‌మన్ గిల్ ఫామ్‌ని తిరిగి అందుకోవడం టీమిండియాకి చాలా అవసరం. సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. రెండో వన్డేలో తుది జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్, అక్షర్ పటేల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు..

మూడో వన్డేలో రెండు మార్పులతో బరిలో దిగుతోంది భారత జట్టు. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, తుది జట్టులోకి రాగా అక్షర్ పటేల్ స్థానంలో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి చోటు దక్కింది. ఇప్పటిదాకా వెస్టిండీస్ టూర్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన జయ్‌దేవ్ ఉనద్కట్, వన్డేల్లో ఎలా రాణిస్తాడో చూడాలి..

వెస్టిండీస్ మాత్రం రెండో వన్డేలో విజయం అందించిన టీమ్‌నే కొనసాగించింది. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లకు ఈ ఫైనల్ మ్యాచ్ పెద్ద పరీక్షే. ఈ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయితే రోహిత్ శర్మ, టీ20ల్లో ప్రదర్శన కారణంగా సూర్యకుమార్ యాదవ్‌కి మళ్లీ అవకాశాలు దక్కవచ్చేమో కానీ శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తే.. సంజూ శాంసన్ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

 

భారత జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్,జయ్‌దేవ్ ఉనద్కట్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్

వెస్టిండీస్ జట్టు: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అతనజే, షై హోప్, సిమ్రాన్ హెట్మయర్, కీసీ కార్టీ, రొమారియో షెఫర్డ్, యన్నిక్ కరియా, అల్జెరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, జేడన్ సీల్స్

 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?