IPL2022 PBKS vs SRH: లివింగ్‌స్టోన్ మరో హాఫ్ సెంచరీ... ఉమ్రాన్ మాలిక్ సెన్సేషనల్ బౌలింగ్...

Published : Apr 17, 2022, 05:27 PM ISTUpdated : Apr 17, 2022, 05:31 PM IST
IPL2022 PBKS vs SRH: లివింగ్‌స్టోన్ మరో హాఫ్ సెంచరీ... ఉమ్రాన్ మాలిక్ సెన్సేషనల్ బౌలింగ్...

సారాంశం

ఐపీఎల్ 2022 సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్, అయినా భారీ స్కోరు చేయలేకపోయిన పంజాబ్ కింగ్స్... ఆఖరి ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్ మ్యాజిక్... 

ఉమ్రాన్ మాలిక్... 150+ కి.మీ.ల వేగంతో బంతులు విసిరి ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా నిలిచిన ఈ యంగ్ పేసర్... పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెన్సేషనల్ స్పెల్‌తో చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 3 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ (రనౌట్‌తో కలిసి నాలుగు)... మెయిడిన్ ఓవర్‌ వేసిన పంజాబ్ కింగ్స్‌ని చావు దెబ్బ తీశాడు. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఒకానొక దశలో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్, 150+ స్కోరు చేస్తుందా? అనిపించినా... లియామ్ లివింగ్‌స్టోన్, షారుక్ ఖాన్ కలిసి జట్టును ఆదుకున్నారు...

గాయపడిన మయాంక్ అగర్వాల్ స్థానంలో పంజాబ్ కింగ్స్‌కి తాత్కాలిక సారథిగా నియమించబడిన శిఖర్ ధావన్, మొదటి ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడడం విశేషం. ఫిజియో చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన శిఖర్ ధావన్... 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

మయాంక్ అగర్వాల్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ప్రభుసిమ్రాన్ సింగ్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. టి నటరాజన్ బౌలింగ్‌లో ప్రభు సిమ్రాన్ షాట్ మిస్ కావడంతో ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో డీఆర్‌ఎస్ తీసుకుంది...

టీవీ రిప్లైలో బంతి బ్యాటు అంచుకు తాకుతున్నట్టు తేలినా... అది వెళ్లి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ చేతుల్లో పడడంతో ఎల్బీడబ్ల్యూలో నాటౌట్‌గా తేలిన ప్రభుసిమ్రాన్ సింగ్, క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 10 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో, ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

అవుట్‌గా ప్రకటించిన వెంటనే జానీ బెయిర్‌స్టో రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. 8 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన జితేశ్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి 61 పరుగుల చేసి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది పంజాబ్ కింగ్స్...

లియామ్ లివింగ్‌స్టోన్‌తో కలిసి ఐదో వికెట్‌కి 71 పరుగుల భఆగస్వామ్యం నెలకొల్పాడు షారుక్ ఖాన్. నట్టూ బౌలింగ్‌లో అంపైర్‌ అవుట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లి బతికిపోయిన షారుక్ ఖాన్... 28 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసిన భువనేశ్వర్ కుమార్‌ బౌలింగ్‌‌లో కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన మొట్టమొదటి భారత పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు భువనేశ్వర్ కుమార్. జస్ప్రిత్ బుమ్రా 134 ఐపీఎల్ వికెట్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు. 

20వ ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్, రెండో బంతికే ఓడియన్ స్మిత్‌కి అవుట్ చేశాడు. 15 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన ఓడియన్ స్మిత్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఆఖరి ఓవర్ నాలుగో బంతికి రాహుల్ చాహార్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు ఉమ్రాన్ మాలిక్. ఆ తర్వాతి బంతికి వైభవ్ అరోరాని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖరి బంతికి అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ రూపంలో అవుట్ కావడంతో ఉమ్రాన్ మాలిక్ హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు...

అయితే 20వ ఓవర్‌లో మెయిడిన్ వేసిన ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో  28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 22 పరుగలిచ్చి 3 వికెట్లు తీశాడు... 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !