
ఐపీఎల్-2022 సీజన్ సరికొత్త రికార్డులకు వేదికవుతున్నది. ఈ క్యాష్ రిచ్ లీగ్ జరుగుతున్నది ఇండియాలోనే అయినా దీనికున్న క్రుజ్ దృష్ట్యా ప్రపంచ దేశాలలో కూడా ప్రసారాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఏకంగా 120 దేశాలలో ఈ లీగ్ ప్రసారమవుతున్నది. ఐపీఎల్ ఇక ఎంతమాత్రమూ ఇండియాకు పరిమితం కాదన్న బీసీసీఐ పెద్దల మాటలను నిజం చేస్తూ.. ఆయా దేశాలలో ప్రసారాలు వారి స్వంత దేశాల సిరీస్ లు, ప్రపంచకప్ ప్రసారాల కంటే అధికంగా చూస్తున్నట్టు తెలుస్తున్నది. విదేశీ ఆటగాళ్లు ఉండటం, వాళ్లు కూడా భారత పిచ్ లపై మెరుపులు మెరిపిస్తుండటంతో భారత్ తో పాటు క్రికెట్ ను ప్రేమించే ప్రతి దేశంలో ఐపీఎల్ ప్రసారాలు అవుతున్నట్టు సమాచారం.
భారత్ లో బీసీసీఐ అధికారిక ప్రసారదారు అయిన డిస్నీ స్టార్ ఇండియా ఈ ప్రసారాలను చేస్తున్నది. ఇంగ్లీష్, హిందీతో పాటు 8 స్థానిక భాషల్లో ఈ లీగ్ ప్రసారాలు జరుగుతున్నాయి. హిందీతో పాటు స్థానికంగా కూడా ఆయా భాషల్లో నెట్ వర్క్ లు ఏర్పాటు చేసుకున్న స్టార్.. ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలను చేస్తున్నది.
ఇండియాలో..
ఇంగ్లీష్, హిందీ, తమిళం, మళయాలం, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాళీ భాషల్లో ఐపీఎల్ ప్రసారాలు అవుతున్నాయి. వీటితో పాటే స్టార్ నెట్వర్క్ భాగస్వామి Disney Hotstar లో కూడా ఐపీఎల్ లైవ్ చూస్తున్నారు జనాలు.
యూకే, ఐర్లాండ్ లో..
యూనైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్ లలో స్కై స్పోర్ట్స్ ఛానెల్ లో ఐపీఎల్ చూడొచ్చు. అయితే అక్కడ హాట్ స్టార్ లో ఇంకా మ్యాచులు వీక్షించే అవకాశంం లేదు.
సౌత్ ఆఫ్రికా, మధ్య ఆసియా, పశ్చిమ ఆఫ్రికాలలో..
సౌతాఫ్రికాలో సూపర్ స్పోర్ట్స్ తో స్టార్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణాఫ్రికాలో ప్రజలు సూపర్ స్పోర్ట్స్ లో ఐపీఎల్ ను వీక్షిస్తున్నారు. బీఇన్ (BeIN) ఛానెల్.. మధ్య ఆసియా, పశ్చిమ ఆఫ్రికాలలో ఐపీఎల్ ప్రసారాలను ప్రసారం చేస్తున్నది. ఈ ఛానెల్.. ఈ రెండు రీజియన్లలో ఫుట్బాల్ మ్యాచునుల ప్రసారం చేస్తుంది.
సౌత్ ఈస్ట్ ఆసియా, సౌత్ అమెరికా, యూరప్ లలో..
దక్షిణాసియా YuppTV ద్వారా ఐపీఎల్ ను అక్కడి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. సౌతాసియా డిజిటల్ మీడియా రైట్స్ (ఐపీఎల్ కు సంబంధించినవి) ఈ ఛానెల్ కే ఉన్నాయి. మలేషియా, సింగపూర్ తో యూరప్ (యూకే, ఐర్లాండ్ మినహా) లలో YuppTV లోనే ఐపీఎల్ ను చూడొచ్చు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో..
ఆస్ట్రేలియాలో ప్రముఖ క్రీడా ఛానెల్ ఫాక్స్ స్పోర్ట్స్ లో ఐపీఎల్ ను వీక్షించొచ్చు. న్యూజిలాండ్ లో కూడా ఈ ఛానెల్ లోనే ఐపీఎల్ ను చూస్తున్నారు అక్కడి ప్రజలు. ఫాక్స్ స్పోర్ట్స్ తో పాటు కయో స్పోర్ట్స్ లో కూడా ఐపీఎల్ ప్రసారాలు అవుతున్నాయి.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో..
2019 వరకు పాక్ లో ఐపీఎల్ ప్రసారాలు ప్రసారం కాలేదు. కానీ ఆ తర్వాత అక్కడి స్థానిక నెట్వర్క్ లతో స్టార్ నెట్వర్క్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం పాక్ లో కూడా పలు స్థానిక ఛానెళ్లలో ఐపీఎల్ ను ఎంజాయ్ చేస్తున్నారు దాయిదా దేశం వాసులు. అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో కూడా పలు స్థానిక ఛానెళ్లు ఐపీఎల్ ను ప్రసారం చేస్తున్నాయి.