డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత వెక్కి వెక్కి ఏడ్చిన ఆయన కూతుళ్లు...

Published : Apr 17, 2022, 01:26 PM ISTUpdated : Apr 17, 2022, 01:31 PM IST
డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత వెక్కి వెక్కి ఏడ్చిన ఆయన కూతుళ్లు...

సారాంశం

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులు చేసి అవుటైన డేవిడ్ వార్నర్... తండ్రి అవుట్ కాగానే వెక్కి వెక్కి ఏడ్చిన వార్నర్ కూతుళ్లు... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున బరిలో దిగుతున్నాడు డేవిడ్ వార్నర్. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో ఉన్న డేవిడ్ వార్నర్... ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో వానిందు హసరంగ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ రివ్యూకి వెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అనుకూలంగా ఫలితం దక్కింది. టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో వార్నర్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 

డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నంత వరకూ 11.2 ఓవర్లలో 94 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యఛేదనకి 16 పరుగుల దూరంలో ఆగిపోయింది.  ఒకానొక దశలో 94/2 స్కోరు వద్ద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్,  15 బంతుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి 115/5 స్కోరుకి చేరుకుంది. 

డేవిడ్ వార్నర్ అవుట్ అవ్వగానే స్టాండ్స్‌లో తండ్రి ఆటను చూసి ఎంజాయ్ చేస్తున్న ఆయన కూతుర్లు వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది డేవిడ్ వార్నర్ భార్య క్యాండిస్ వార్నర్...

‘డాడీ అవుట్ కాగానే గర్ల్స్ ఇలా ఏడ్చేశారు...’ అంటూ కాప్షన్ ఇచ్చింది క్యాండిస్ వార్నర్. గత ఐదు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో కీ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్... గత సీజన్లలో రూ.12.5 కోట్లు తీసుకున్నాడు...

ఐపీఎల్ 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, డేవిడ్ వార్నర్‌ని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. పృథ్వీ షాతో కలిసి ఓపెనింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్, ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచుల్లో 131 పరుగులు చేశాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టును సొంత ఫ్రాంఛైజీగా భావించిన డేవిడ్ వార్నర్, ఆయన కూతుళ్లతో కలిసి ఆరెంజ్ ఆర్మీకి సపోర్టుగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు. గత సీజన్‌లో టీమ్ సెలక్షన్ విషయంలో డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్ల కారణంగా కెప్టెన్సీ కోల్పోయిన డేవిడ్ వార్నర్, జట్టులో చోటు కూడా కోల్పోయాడు...

డేవిడ్ వార్నర్‌కి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. వార్నర్ భార్య కాండీస్ వార్నర్ ఆస్ట్రేలియాలో ప్రొఫెషనల్ ఐరన్‌వుమెన్‌గా, సర్ఫ్ లైఫ్ సేవర్‌గా చేసి రిటైర్ అయ్యింది. డేవిడ్ వార్నర్ చిన్న కూతురు ఇండి వార్నర్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !