IPL 2024 Auction LIVE: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ కోసం ఆటగాళ్ల వేలం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మొదటిసారి విదేశాల్లో ఐపీఎల్ వేలం జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటల నుంచి దుబాయ్ లో వేలం పాట ప్రారంభం కానుంది.
IPL 2024 Auction LIVE updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం దుబాయ్‌లోని కోకా-కోలా ఎరీనాలో మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మినీ ఐపీఎల్ 2024 వేలం బలమైన జట్టును రూపొందించడానికి 10 జట్లకు అవకాశం కల్పిస్తుంది. 214 మంది భారతీయులు, 119 విదేశీ ఆటగాళ్లతో సహా మొత్తం 333 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. 30 మంది విదేశీ ఆటగాళ్లతో సహా 77 మంది ఆటగాళ్లు వివిధ జట్లు వేలంలో ఒప్పందాలు చేసుకోనున్నాయి.
వేలంలో ఉన్న ఆటగాళ్లలో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ సహా 23 మంది ఆటగాళ్లు బేస్ ప్రైస్ 2 కోట్లుగా నిర్ణయించారు. 13 మంది ఆటగాళ్ల బేస్ ధర 1.5 కోట్లుగా నిర్ణయించారు. ఇంగ్లిష్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2023 వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. సామ్ కర్రాన్ తర్వాత కామెరాన్ గ్రీన్ (17.50 కోట్లు MI), బెన్ స్టోక్స్ (CSK రూ. 16.25 కోట్లు), క్రిస్ మోరిస్ (RR రూ. 16.25 కోట్లు), నికోలస్ పూరన్ (LSG రూ. 16 కోట్లు) లు టాప్ లో ఉన్నారు.
ఐపీఎల్ 2024 లో ఉన్న జట్లు: ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాజస్థాన్ రాయల్స్ (RR), గుజరాత్ టైటాన్స్ (GT), పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG).
They have been a part of the auction madness before 🔨
A special day awaits for the franchises and they are ready to get going 😃 👌 | pic.twitter.com/yd1q6P7STK