
ఐపీఎల్ 2023 ఆరంభ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, 9 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. మహ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్‌ని ఫేస్ చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి పరుగు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు...
మొదటి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రాగా హార్ధిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్ మొదటి బంతికే ఫోర్ బాదిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి బౌండరీ కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు.. 6 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసిన డివాన్ కాన్వేని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...
మహ్మద్ షమీకి ఇది 100వ ఐపీఎల్ వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత జోషువా లిటిల్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి పరుగు, తొలి ఫోర్, తొలి సిక్సర్ కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు..
మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో 4, 6, 4 బాది 17 పరుగులు రాబట్టిన మొయిన్ ఆలీ, ఆ తర్వాత రషీద్ ఖాన్ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటైనా డీఆర్‌ఎస్ తీసుకోవడంతో నాటౌట్‌గా తేలాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన బెన్ స్టోక్స్, ఆ తర్వాత బంతికే సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 70 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. ఆ తర్వాత అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్, 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..