IPL 2023 CSK vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పైనే...

By Chinthakindhi RamuFirst Published Mar 31, 2023, 7:14 PM IST
Highlights

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

ఐపీఎల్ 2023 సీజన్ మొదటి మ్యాచ్‌లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా  తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు... చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అమలులోకి వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఇరు జట్ల కెప్టెన్లు కూడా టాస్ సమయంలో జట్లను ప్రకటించలేదు. 

ఎలాంటి అంచనాలు లేకుండా ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ విజేతగా నిలిచింది. మొదటి సీజన్‌లో దక్కిన విజయం గాలివాటుగా వచ్చిన సక్సెస్ కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత గుజరాత్ టైటాన్స్‌పై ఉంది.

Latest Videos

గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకుని, కేవలం 4 విజయాలతో 9వ స్థానంలో నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. 2020 సీజన్‌లో మొదటిసారి ప్లేఆఫ్స్ చేరలేకపోయిన తర్వాత 2021 సీజన్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి టైటిల్ గెలిచింది సీఎస్‌కే. దీంతో ఈసారి కూడా చెన్నైపై భారీ అంచనాలు ఉన్నాయి..

అదీకాకుండా ఐపీఎల్ 2019 తర్వాత మొదటిసారిగా చెన్నైలో మ్యాచులు ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. అలాగే మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై భారీ అంచనాలు ఉన్నాయి...

గాయం కారణంగా గత సీజన్‌లో ఆడని దీపక్ చాహార్‌తో పాటు కొత్తగా టీమ్‌లోకి వచ్చిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా చెన్నై సూపర్ కింగ్స్‌పై భారీ అంచనాలు పెరగడానికి ఓ కారణం..

ఐపీఎల్ 2023 సీజన్‌లో అమలులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, ఎలా ఉపయోగపడుతుంది? ఇరు జట్లు దీన్ని ఎలా వాడుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.. టాస్ గెలిచిన తర్వాత టీమ్‌ని ప్రకటించే వెసులుబాటుని టీమ్స్‌కి కల్పించింది బీసీసీఐ. దీంతో ఇరు జట్ల కెప్టెన్లు కూడా టాస్ సమయంలో టీమ్‌లను ప్రకటించలేదు...

అండర్19 వరల్డ్ కప్ 2022 విన్నింగ్ టీమ్ ఆల్‌రౌండర్ రాజవర్థన్ హంగేర్కర్‌కి తుది జట్టులో అవకాశం కల్పించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది చెన్నై సూపర్ కింగ్స్. ముకేశ్ కుమార్ చౌదరి గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరం కావడంతో రాజవర్థన్‌కి అవకాశం కల్పించింది సీఎస్‌కే.. 

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ఇది: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శివమ్ దూబే, దీపక్ చాహార్, మిచెల్ సాంట్నర్, రాజవర్థన్ హంగేర్కర్

గుజరాత్ టైటాన్స్ టీమ్ ఇది: శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), కేన్ విలియంసన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జోష్ లిటిల్, యష్‌ దయాల్, అల్జెరీ జోసఫ్

ఇరు జట్లు కూడా టీమ్‌లో లేని ఇంపాక్ట్ ప్లేయర్‌ని 14 ఓవర్లలోపు టీమ్‌లోకి తీసుకురాబోతున్నాయి. 

click me!