IPL 2023, RCBvsCSK: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు.. బెంగళూరు - చెన్నై మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ

By Srinivas MFirst Published Apr 17, 2023, 7:03 PM IST
Highlights

IPL 2023, RCBvsCSK: ఐపీఎల్-16 లో నేడు  రెండు  మోస్ట్ ఫ్యాన్ బేస్డ్ టీమ్స్ మధ్య మరో ఆసక్తికర సమరం జరుగనుంది.  ఆర్సీబీ.. తన సొంత గ్రౌండ్ లో ధోని సేనను  ఢీకొననుంది.  

ఐపీఎల్ - 2023 ఎడిషన్ మొదలై  సుమారు 20 రోజులు కావొస్తున్నది.   దాదాపు అన్ని జట్లూ ఐదేసి మ్యాచ్ లు ఆడాయి.  గడిచిన  పది రోజులుగా లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లు,   బంతి బంతికి హైడ్రామా  మధ్య   మ్యాచ్ లు సాగుతున్నాయి.  అలాంటి పోరును అందివ్వడంలో ఎక్స్‌పర్ట్స్ గా ఉన్న  రెండు అగ్రశ్రేణి జట్లు  నేడు  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడుతున్నాయి.  ఐపీఎల్ లో  ఓల్డ్ రైవలరీస్ (పాత శత్రువులు) గా గుర్తింపు ఉన్న ధోని సారథ్యంలోని  చెన్నై సూపర్ కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  నేడు  చిన్నస్వామి స్టేడియంలో ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన డుప్లెసిస్ సేన ఫస్ట్  బౌలింగ్ కు రానుంది.  ధోని గ్యాంగ్ బ్యాటింగ్  చేయనుంది. 

ఐపీఎల్ - 16 పాయింట్ల పట్టికలో   ఆర్సీబీ  నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి  రెండింట్లో ఓడి  ఏడో స్థానంలో ఉంది.  చెన్నై కూడా నాలుగు మ్యాచ్ లే ఆడి రెండు గెలిచి రెండింట్లో ఓడి  నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.  ఈ మ్యాచ్ లో గెలిచిన  జట్టు    ఐదో స్థానంలో ఉన్న కేకేఆర్ ను అధిగమించే ఛాన్స్ ఉంటుంది.  

Latest Videos

కాగా ఆడిన ప్రతీ  మ్యాచ్ లో ఒక్క ప్లేయర్ చొప్పున గాయాల పాలవుతున్న  చెన్నైకి బెంగళూరుతో మ్యాచ్ లో   పేసర్ సిసంద మగల ఆడటం లేదు. అతడి స్థానంలో  లంక పేసర్ మతీశ పతిరన తుది జట్టులోకి వచ్చాడు. బెన్ స్టోక్స్, చాహర్ లు  ఈ మ్యాచ్ లో కూడా ఆడటం  లేదు.  బెంగళూరు మాత్రం ఢిల్లీతో  ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నది. 

 

🚨 Toss Update from M. Chinnaswamy Stadium 🏟️ has won the toss & have elected to bowl against the -led .

Follow the match ▶️ https://t.co/QZwZlNju3V | pic.twitter.com/rHKuDWsRuG

— IndianPremierLeague (@IPL)

తుది జట్లు : 

చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మోయిన్ అలీ,  అంబటి రాయుడు,   శివమ్ దూబే,  రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), మతీశ పతిరన, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, వనిందు హసరంగ, వేన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాక్, మహ్మద్  సిరాజ్ 

click me!