
‘ఎం.ఎస్. ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ’ అంటూ మాహీ గురించి అందరికీ తెలిసినే కథే చెప్పినా బాక్సాఫీస్ దగ్గర సినిమాని సూపర్ హిట్ చేశారు జనాలు. ఆ తర్వాత ‘సచిన్ టెండూల్కర్- 200 నాటౌట్’, ‘అజర్’, ‘83’ వంటి సినిమాలు వచ్చాయి. భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా త్వరలో తెరకెక్కబోతోంది...
టెస్టు క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన మొట్టమొదటి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ‘800’ టైటిల్‌తోనే బయోపిక్ తీయాలని అప్పుడెప్పుడో 2020లో ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పట్లో తమిళ నటుడు విజయ్ సేతుపతి, ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించబోతున్నట్టు పోస్టర్ కూడా విడుదల చేసింది మూవీ యూనిట్...
శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడులు, సివిల్ వార్ గురించి ముత్తయ్య మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు, అతనిపై తమిళ ప్రజలు ద్వేషం పెంచుకోవడానికి కారణమయ్యాయి. ‘సివిల్ వార్ ముగిసింది. అమాయక ప్రజల చావులకు తెరపడింది. ఆనందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించాడు ముత్తయ్య మురళీధరన్...
కొన్ని వందల మంది తమిళులు చనిపోతే, వారి మరణాలు సంతోషాన్ని కలిగించాయనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన ముత్తయ్య మురళీధరన్‌పై తమిళనాడులో నిరసనలు వ్యక్తం చేశారు. సివిల్ వార్ నుంచి లంకేయులంటే తమిళ ప్రజలకు ద్వేషం పెరిగింది..
చెన్నై సూపర్ కింగ్స్‌లో తమిళనాడు ప్లేయర్లను తీసుకోవడంపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అలాంటి లంక క్రికెటర్ పాత్ర పోషించేందుకు విజయ్ సేతుపతి అంగీకరించడంతో వివాదం రేగింది. దీంతో అతను ఈ బయోపిక్ నుంచి తప్పుకున్నాడు..
తమిళ దర్శకుడు ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘800’ సినిమాను మూవీ ట్రైన్ మోక్షన్ పిక్చర్స్, వివేక్ రంగాచారి నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ వంటి సినిమాల్లో నటించిన మధుర్ మిట్టర్, ముత్తయ్య మురళీధరన్ పాత్రలో కనిపించబోతున్నాడు..
విజయ్ సేతుపతి, అచ్చు ముత్తయ్యలా కనిపించగా, మధర్ మిట్టర్ లుక్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఉంది. ‘800’ మూవీతో హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
శరణార్థులుగా శ్రీలంకకి వెళ్లిన తమిళ కుటుంబానికి చెందిన ముత్తయ్య మురళీధరన్, తమిళనాడుకు చెందిన మదిమలార్ రామమూర్తిని 2005లో పెళ్లి చేసుకున్నాడు. టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1,374 వికెట్లు, లిస్టు ఏ క్రికెట్‌లో 682 వికెట్లు తీసిన ఈ లెజెండరీ బౌలర్, ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు ముత్తయ్య మురళీధరన్.