IPL2023 CSK vs RR: టాస్ గెలిచిన సంజూ శాంసన్... ఇద్దరు కూల్ కెప్టెన్ల మధ్య ఫైట్‌లో...

By Chinthakindhi RamuFirst Published Apr 27, 2023, 7:04 PM IST
Highlights

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్... ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఆడమ్ జంపా... ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి రాయల్స్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 2019లో చివరిగా ఈ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఆ మ్యాచ్‌లో అంపైర్ నో బాల్ ఇచ్చిన తర్వాత నిర్ణయం మార్చుకోవడంతో డగౌట్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, క్రీజులోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదం చేయడం అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేసింది...

Latest Videos

మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్రీజులో లేని ప్లేయర్, లేదా కెప్టెన్... లోపలికి వచ్చి ఇలా మ్యాచ్‌కి అంతరాయం కలిగించడం క్రికెట్ నిబంధనలకు విరుద్ధం. మాహీ లాంటి వ్యక్తి, ఒక్క ఎక్స్‌ట్రా కోసం ఇలా అతిగా ప్రవర్తించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే అలా ప్రవర్తించినందుకు ధోనీకి ఎలాంటి జరిమానా విధించలేదు ఐపీఎల్ మేనేజ్‌మెంట్....

వరుస విజయాలతో ఐపీఎల్ 2023 సీజన్ ఫస్టాఫ్‌లో 5 విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ఓపెనర్ డివాన్ కాన్వేతో పాటు రుతురాజ్ గైక్వాడ్, అజింకా రహానే, శివమ్ దూబే... బ్యాటింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు...

రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, అంబటి రాయుడులకు చాలా తక్కువ సార్లు బ్యాటింగ్ వచ్చినా, వచ్చినప్పుడల్లా మెరుపులు మెరిపించారు. బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్, మతీశ పథిరాణా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నారు..

వేలంలో రూ.16.25 కోట్లు పెట్టి కొన్న బెన్ స్టోక్స్, గాయం కారణంగా రెండు వారాలుగా టీమ్‌కి దూరంగా ఉన్నాడు. నేటి మ్యాచ్‌లో కూడా బెన్ స్టోక్స్ ఆడడం లేదు. 

మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ కూడా ఈ సీజన్‌లో టాప్ క్లాస్ పర్పామెన్స్ ఇస్తున్నా, కొన్ని మ్యాచుల్లో విజయం అంచుల దాకా వచ్చి ఓడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్‌పైన ఎక్కువ ఆధారపడుతోంది రాజస్థాన్..

వీరితో పాటు సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, సిమ్రాన్ హెట్మయర్, ధృవ్ జురెల్ కొన్ని మ్యాచుల్లో మెరుపులు మెరిపించినా నిలకడైన ప్రదర్శన చూపించలేకపోతున్నారు. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు సందీప్ శర్మ ఆకట్టుకుంటున్నారు..

వరుసగా విఫలమవుతున్నా యంగ్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ని కొనసాగిస్తూ వస్తున్న రాజస్థాన్ రాయల్స్,తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. అతని స్థానంలో రిజర్వు బెంచ్‌లో ఉన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ని ఆడించినా బెటర్‌గా ఆడేవాడని విమర్శలు వస్తున్నాయి...

ట్రెంట్ బౌల్ట్‌ గాయం కారణంగా మిస్ కావడంతో అతని స్థానంలో ఆడమ్ జంపా తుది జట్టులోకి వచ్చాడు. ఏకంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది రాజస్థాన్ రాయల్స్...

రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్, సిమ్రాన్ హెట్మయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యజ్వేంద్ర చాహాల్.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, అజింకా రహానే, మొయిన్ ఆలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీ, మథీశ పథిరాణా, తుషార్ దేశ్‌పాండే, మహీశ తీక్షణ, ఆకాశ్ సింగ్ 

click me!