రాజస్తాన్‌తో మ్యాచ్ లో స్పెషల్ రికార్డు కొట్టబోతున్న ధోని.. ప్రపంచ క్రికెట్‌లో మరెవరికీ సాధ్యం కాని ఘనత!

Published : Apr 12, 2023, 05:06 PM IST
రాజస్తాన్‌తో మ్యాచ్ లో స్పెషల్ రికార్డు కొట్టబోతున్న ధోని.. ప్రపంచ క్రికెట్‌లో మరెవరికీ సాధ్యం కాని ఘనత!

సారాంశం

IPL 2023:  ఐపీఎల్  -16లో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది.  ఒక ఫ్రాంచైజీకి   కెప్టెన్ గా  200 మ్యాచ్ లు ఆడిన ఘనత దక్కించుకోబోతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. 

టీమిండియా మాజీ సారథి,  ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్వవహరిస్తున్న  మహేంద్ర సింగ్ ధోని  మరో అరుదైన ఘనతను అందుకోబోతున్నాడు.    నేటి రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భాగంగా రాజస్తాన్  రాయల్స్ తో మ్యాచ్ ఆడనున్న  ధోనికి ఇది కెప్టెన్ గా  200 వ మ్యాచ్ కావడం గమనార్హం.  ఐపీఎల్ తో  పాటు  ఇతర ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ లలో కూడా ఇది దాదాపు అసాధ్యమైన  ఘనతే. ఐపీఎల్ ప్రారంభ సీజన్  2008 నుంచి సీఎస్కేకు కెప్టెన్ గా ఉంటున్న ధోని.. నేటి మ్యాచ్ తో  200 వ మ్యాచ్  కు  సారథిగా  అరుదైన ఘనతను అందుకోబోతున్నాడు. 

ఐపీఎల్ లో ఇప్పటివరకు  237 మ్యాచ్ లు ఆడాడు ధోని.   2016,  2017 సీజన్ లలో  చెన్నై సూపర్ కింగ్స్ పై నిషేధం కారణంగా ఆ రెండేండ్లు  ధోని..  రైజింగ్  పూణె సూపర్ జెయింట్స్ కు ఆడాడు.   ఆ రెండేండ్లు మినహాయిస్తే  2008 నుంచి ఇప్పటిదాకా ధోని.. ఐపీఎల్ లో తన సేవలను సీఎస్కేకు ధారపోశాడు. 

2022 సీజన్ కు ముందు   కెప్టెన్ గా  తప్పుకున్న ధోని.. రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పజెప్పాడు.  కానీ 8 మ్యాచ్ లకే  జడేజా.. ఒత్తిడి తట్టుకోలేక   వాటిని తిరిగి ధోనికే  ఇచ్చేశాడు. ఈ సీజన్  లో కూడా ధోనినే సారథిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా   సీఎస్కేను 9 సార్లు ఫైనల్ చేర్చిన ధోని..  2010, 2011, 2018, 2021 లలో  ఆ జట్టుకు  ట్రోఫీలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.  కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ  (4,881)  తర్వాత  ధోని (4,482)  రెండో స్థానంలో నిలిచాడు. 

 

ధోని కెప్టెన్ గా 200 వ మ్యాచ్ ఆడుతున్న వేళ   సీఎస్కే  ట్విటర్ ఖాతాలో 2008 నుంచి ధోనికి సంబంధించిన ఫోటోలను  షేర్ చేసింది.  ‘ఓ  కెప్టెన్.. అవర్ కెప్టెన్’ అని ఆ ఫోటోలకు  కామెంట్ చేసింది.   అలాగే  ట్విటర్ లో  #Thala200 కూడా ట్రెండింగ్ లో ఉంది.  కెప్టెన్ గా 200వ మ్యాచ్ లో  ధోనికి అపురూప విజయాన్ని అందించేందుకు  చెన్నై చిన్నోళ్లు సిద్ధమయ్యారు.  మరి నేటి మ్యాచ్ లో తాలా  అభిమానులకు ఏం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేనో...!

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన