తమ్ముడికి రికార్డు ధర, అన్నకేమో నిరాశ... వేలంలో అమ్ముడుపోని టామ్ కర్రాన్! కుర్రాళ్లకు లక్కీ ఛాన్స్..

Published : Dec 23, 2022, 07:48 PM IST
తమ్ముడికి రికార్డు ధర, అన్నకేమో నిరాశ... వేలంలో అమ్ముడుపోని టామ్ కర్రాన్! కుర్రాళ్లకు లక్కీ ఛాన్స్..

సారాంశం

ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌‌గా సామ్ కుర్రాన్ (రూ.18.50 కోట్లు) రికార్డు క్రియేట్ చేయగా అతని అన్న టామ్ కుర్రాన్ మాత్రం వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరాడు. 

ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఐర్లాండ్ సీనియర్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్‌ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. మనీశ్ పాండే కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.2 కోట్ల 40 లక్షలకు మనీశ్ పాండేని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్ దేర్ దుస్సేన్‌, విండీస్ బ్యాటర్ షెఫ్రెన్ రూథర్‌ఫర్డ్‌ అన్‌సోల్డ్ ప్లేయర్ల లిస్టులో చేరిపోయారు. ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్‌ని రూ.3 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత బ్యాటర్ మన్‌దీప్ సింగ్‌లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్‌  కూడా అమ్ముడుపోని ప్లేయర్ల లిస్టులో చేరాడు.

రొమానియో షెఫర్డ్‌ని రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. న్యూజిలాండ్ బ్యాటర్ డార్ల్ మిచెల్ కూడా ఏ ఫ్రాంఛైజీని ఆకర్షించలేకపోయాడు. డానియల్ సామ్స్‌ని రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...

ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ,  సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వేన్ పార్నెల్ కూడా అన్‌సోల్డ్ ప్లేయర్ల జాబితాలో చేరారు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీశమ్, లంక కెప్టెన్ దసున్ శనక కూడా అమ్ముడుపోలేదు..

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ రిలే మెడరిత్, భారత స్వదేశీ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మలకు కూడా నిరాశే ఎదురైంది. బంగ్లా ఫాస్ట్ బౌలర్ టస్కిన్ అహ్మద్, లంక ఫాస్ట్ బౌలర్ దుస్మంత ఛమీరా, జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ ముజరబానీలను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు...

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కేల్ జెమ్మీసన్‌ని రూ.1 కోటికి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్..  

పియూష్ చావ్లాని ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అమిత్ మిశ్రాని లక్నో సూపర్ జెయింట్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేశాయి.  హర్‌ప్రీత్ భాటియాని రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...

మనోజ్ భంగాడేని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. మయాంక్ దగర్‌ని రూ.1 కోటి 70 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దువాన్ జాన్సెన్‌ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్, ప్రేరక్ మన్కండ్‌ని లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్నాయి..

జగదీశ సుచిత్, సుర్యాంశ్ సెజ్డే అమ్ముడుపోకపోగా డోనెవన్ ఫెర్రెరియాని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. 

బాబా ఇంద్రజిత్ అన్‌సోల్డ్ జాబితాలో చేరగా వుర్విల్ పటేల్‌ని రూ.20 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. విష్ణు వినోద్‌ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్..

విద్వత్ కరియప్ప‌ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. రజన్ కుమార్‌ని రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. పాల్ వాన్ మీకీరన్, కిరంత్ షిండే, ఆకాశ్ సింగ్, తేజస్ బరోకా, యువరాజ్ చుదస్మా... బిడ్డింగ్ దక్కించుకోలేకపోయారు..

సుయాష్ శర్మను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జెమ్మీ ఓవర్టన్‌ని ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. ఆఫ్ఘాన్ బౌలర్ నవీన్ వుల్ హక్‌ని, రిచర్డ్ గ్లాసిన్‌ని ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు..

ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్‌ని రూ.4 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. భారత బౌలర్ మోహిత్ శర్మను బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్...

శామ్స్ ములానీని రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. స్వప్నిల్ సింగ్‌ని రూ.20 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. నమీబియా ప్లేయర్ డేవిడ్ వీజ్‌ని కేకేఆర్ రూ.1 కోటికి దక్కించుకుంది.

నితీశ్ కుమార్ రెడ్డిని రూ.20 లక్షలకు దక్కించుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అవినాష్ సింగ్‌ని రూ.60 లక్షలకు దక్కించుకుంది ఆర్‌సీబీ. ఇంగ్లాండ్ తరుపున ఆరంగ్రేటం చేసి ఐదు వికెట్లు తీసిన రెహాన్ అహ్మద్‌ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు...

సామ్ కర్రాన్ అన్న టామ్ కర్రాన్ కూడా వేలంలో బేస్ ప్రైజ్ కూడా దక్కించుకోలేకపోయాడు. సంజయ్ రామస్వామి, బీ సూర్య, వరుణ్ అరోణ్‌, ప్రియాంక్ పంచల్ కూడా అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిపోయారు...


 కునాల్ రాథోడ్‌ని రూ.20 లక్షలకు దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. సోనూ యాదవ్‌ని ఆర్‌సీబీ, కుల్వంత్ జెరోలియాని కేకేఆర్, అజయ్ మండల్‌ని సీఎస్‌కే బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు దక్కించుకున్నాయి.

మోహిత్ రత్నేని పంజాబ్ కింగ్స్, నేహాల్ వదేరాని ముంబై ఇండియన్స్, శివమ్ సింగ్‌ని పంజాగ్ కింగ్స్, భగత్ వర్మను సీఎస్‌కే బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేశాయి..
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !