రాత్రనగా మొదలుపెట్టారు.. తెల్లార్లూ ఒకటే మ్యూజిక్..! ఆ పదాలను నిషేధించిన లక్నో.. అంతా మ్యాంగో మ్యాన్ మహిమ

By Srinivas MFirst Published May 25, 2023, 5:17 PM IST
Highlights

IPL 2023: అఫ్గాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ పుణ్యమా అని ఐపీఎల్ లో అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ ట్విటర్ ఖాతా.. కోహ్లీ ఫ్యాన్స్ ఇస్తున్న షాకులతో మోతెక్కిపోతున్నది. 

ఐపీఎల్ - 16 ప్లేఆఫ్స్ లో భాగంగా బుధవారం ముగిసిన  ఎలిమినేటర్  మ్యాచ్ లో  ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన  లక్నో సూపర్ జెయింట్స్ పై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదంతా టీమ్ బాగా ఆడనందుకు మొత్తానికి గంపగుత్తగా లక్నో టీమ్ మొత్తాన్ని  ట్రోల్స్ చేస్తున్నారంటే పొరపాటే. ఆ జట్టు పేసర్  నవీన్ ఉల్ హక్ తో పాటు టీమ్ మెంటార్ గౌతం గంభీర్ లను  కోహ్లీ ఫ్యాన్స్ ఆటాడుకుంటున్నారు. అందరూ తమను ట్రోల్ చేస్తున్నారనే ఆవేదలో లేక వేరేవాళ్లు ఎవరో ట్రోల్ చేయాల్సిన పనేముందని, తమను తామే ట్రోల్ చేసుకుంటామనుకున్నారో మరేంటో గానీ లక్నో సూపర్ జెయింట్స్ తాజాగా చేసిన ట్వీట్ మాత్రం అది సెల్ఫ్ కౌంటరే. 

ముంబై చేతిలో లక్నో ఓడిపోయిన తర్వాత కోహ్లీ, ఆర్సీబీతో పాటు చాలా మంది న్యూట్రల్ ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా  నవీన్ ఉల్ హక్ ను సోషల్ మీడియాలో ఆటాడుకున్నారు.   ‘మ్యాంగో మ్యాన్’గా  సోషల్ మీడియాలో అభిమానులు పిలుచుకునే  నవీన్ కు కౌంటర్ గా   ట్విటర్ మ్యాంగోస్ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీలు కూడా  నవీన్ ను ట్రోల్ చేస్తూ   పోస్టులు చేశారంటే  మ్యాంగో మ్యాన్ క్రేజ్ ఏ లెవల్  లో ఉందో అర్థం చేసుకోవచ్చు.  లక్నో ఓటమి తర్వాత  ఆ జట్టు ట్విటర్ అధికారిక ఖాతాలో ‘మా ప్రయోజనార్థం’ అని  చెప్పి  కొన్ని పదాలను మ్యూట్ చేస్తున్నట్టుగా  ఫోటో షేర్ చేసింది. ఇందులో మ్యూట్ వర్డ్స్ గా ‘మ్యాంగో’  ‘మ్యాంగోస్’,  ‘స్వీట్’, ‘ఆమ్’ తో  పాటు మ్యాంగో సింబల్ ఉన్న ఎమోజీని కూడా  మ్యూటెడ్ వర్డ్స్ లిస్ట్ లో చేర్చింది.  

 

Issued in our interest 😅🤝 pic.twitter.com/e1Jn9gWATn

— Lucknow Super Giants (@LucknowIPL)

ఇదే పోస్టులో  మ్యూటెడ్ వర్డ్స్ ఉంటే ఇందుకు సంబంధించిన పదాలతో ఉండే ట్వీట్స్ నోటిఫికేషన్స్ మీకు రావు.. అవి మీ హోంటైమ్ లైన్ లో కనపడవు అని డిస్క్రిప్షన్ లో ఉంది.   ఇది  లక్నోకు లక్నోనే ఇచ్చుకున్న సెల్ఫ్ కౌంటరే అని సోషల్ మీడియాలో అభిమానులు చెప్పుకుంటున్నారు. 

 

 

Someone from Bangalore has just ordered 10kg mangoes 🤔🤔🤔

— Swiggy Instamart (@SwiggyInstamart)

లక్నో - బెంగళూరు మ్యాచ్  లో కోహ్లీతో గొడవపడ్డ నవీన్ ఆ తర్వాత  చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ముంబై -  బెంగళూరు మ్యాచ్ లో  కోహ్లీ ఔటయ్యాక.. ముంబై మ్యాచ్ ను చూస్తూ.. ఓ గిన్నెలో  మామిడి  పండ్లను షేర్ చేస్తూ ‘స్వీట్ మ్యాంగోస్’అని  ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం తెలిసిందే.  ఇక అప్పట్నుంచి నవీన్..  కోహ్లీతో పాటు   దాదాపు భారతీయ అభిమానులందరికీ ట్రోలింగ్ సరుకు అయ్యాడు. నిన్న ముంబైతో మ్యాచ్ లో నవీన్.. నాలుగు వికెట్లతో రాణించిన  తర్వాత  కూడా కెఎల్ రాహుల్ స్టైల్ లో సెలబ్రేషన్స్ చేసుకోవడం వారికి మరింత ఆగ్రహాన్ని కలిగించింది. 

 

Le : after todays match pic.twitter.com/ng8dryVFK6

— Rahul rana (@born2tweett)

Virat Kohli after the eliminator welcome to Gautam Gambhir sir and giving Sweet Mangoes to Naveen-Ul-Haq be like😅 pic.twitter.com/zD8tIEPIln

— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08)
click me!