IPL 2023: ‘ఇంపాక్ట్’ చూపని ప్లేయర్.. చెన్నై-గుజరాత్‌లకు నిరాశే..

Published : Apr 01, 2023, 11:33 AM IST
IPL 2023: ‘ఇంపాక్ట్’ చూపని ప్లేయర్.. చెన్నై-గుజరాత్‌లకు నిరాశే..

సారాంశం

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఈ ఏడాది  కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.  ఇందులో  బాగా చర్చ నడుస్తున్నది ఇంపాక్ట్ ప్లేయర్ గురించే.. 

ఐపీఎల్ లో ఈ  సీజన్ నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధన ‘ఇంపాక్ట్ ప్లేయర్’. ఈ నిబంధన ప్రకారం   ఇరు జట్లూ  ముందు  జట్లను ప్రకటించకుండా  మ్యాచ్ ఆడేందుకు ముందు  అంపైర్లకు ఇస్తే సరిపోతుంది. మ్యాచ్ లో ఎప్పుడైనా  వీరిని బరిలోకి దించొచ్చు. అయితే  ఇంపాక్ట్ ప్లేయర్  ప్లేస్ లో వెళ్లబోయే  క్రికెటర్ మాత్రం తిరిగి  ఫీల్డ్ లోకి రాకూడదు. కొత్త నిబంధనల మేరకే నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ లు ఇంపాక్ట్ ప్లేయర్ ను  తీసుకొచ్చాయి. మరి  సదరు ఆటగాడు.. మ్యాచ్ ను ఏ మేరకు  ప్రభావం చూపాడు..? 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హార్ధిక్ పాండ్యా.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై బ్యాటింగ్ కు వచ్చింది. చెన్నై బ్యాటింగ్ చేసేప్పుడు గానీ  గుజరాత్ బౌలింగ్ సమయంలో గానీ రెండు  జట్లూ  ఇంపాక్ట్ ప్లేయర్ ను ఉపయోగించలేదు.   కానీ రెండో ఇన్నింగ్స్ మొదలయ్యాక  ఇరు జట్లూ ఈ ఆప్షన్ ను ఎంచుకున్నాయి. 

సీఎస్కే తరఫున  బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడు (12) స్థానంలో  ఆ జట్టు బౌలర్ తుషార్ దేశ్‌పాండేను బరిలోకి దింపింది.  గుజరాత్  జట్టు కూడా  గాయపడిన  కేన్ విలియమ్సన్ స్థానంలో సాయి సుదర్శన్ ను  తీసుకొచ్చింది. కానీ ఈ ఇద్దరూ  మ్యాచ్  లో ఏమాత్రం ‘ఇంపాక్ట్’ చూపలేకపోయారు. ముఖ్యంగా  ఐపీఎల్ చరిత్రలో తొలి ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన తుషార్ దేశ్‌పాండే అయితే అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.   గుజరాత్ బ్యాటింగ్ చేస్తుండగా 3.2 ఓవర్లు బౌలింగ్  చేసిన  తుషార్.. ఏకంగా  51 పరుగులిచ్చి హాఫ్ సెంచరీ కొట్టి గుజరాత్  విజయానికి బాటలు వేశాడు. ఈ మ్యాచ్ లో   మిగిలిన సీఎస్కే బౌలర్ల ఎకానమీ  7, 8 ఉంటే  ఇంపాక్ట్ ప్లేయర్ అయిన తుషార్ ఎకానమీ మాత్రం 15.30 గా ఉంది.  

 

తుషార్  కథ ఇలా ఉంటే   గుజరాత్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన సాయి సుదర్శన్  మాత్రం  ఫర్వాలేదనిపించాడు.  ఓపెనర్ వృద్ధిమాన్ సాహా నిష్క్రమించడంతో  కేన్ మామ  స్థానంలో  బ్యాటింగ్ కు వచ్చిన సుదర్శన్.. 17 బంతులు ఆడాడు.  3 ఫోర్ల సాయంతో   22 పరుగులు చేశాడు.   ఏదేమైనా చెన్నై, గుజరాత్ లు  ఇంపాక్ట్ ప్లేయర్ ను సరిగా వాడుకోలేదనే  మ్యాచ్ ను చూస్తేనే  అర్థం చేసుకోవచ్చు. మరి రానున్న మ్యాచ్ లలో   మిగతా జట్లు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను ఏమేరకు సద్వినియోగం చేసుకుంటాయో చూడాలి. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?