IPL 2023 DC vs CSK: టాస్ గెలిచిన ధోనీ... గెలిస్తే క్వాలిఫైయర్‌కి, ఓడితే...

By Chinthakindhi RamuFirst Published May 20, 2023, 3:05 PM IST
Highlights

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... గెలిస్తే క్వాలిఫైయర్ ఆడే ఛాన్స్, ఓడితే ఆ రెండు జట్లకు అవకాశం...

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇదే ఈ సీజన్‌లో ఆఖరి మ్యాచ్. 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే... 17 పాయింట్లతో మొదటి క్వాలిఫైయర్ ఆడుతుంది..  లక్నో సూపర్ జెయింట్స్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండడం చెన్నై సూపర్ కింగ్స్‌కి కలిసి వచ్చే విషయం..

Latest Videos

ఈ రెండు జట్ల మధ్య 2023 సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం అందుకుంది. మహీశ్ తీక్షణ, పథిరాణా బౌలింగ్‌ పర్ఫామెన్స్‌తో 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది డేవిడ్ వార్నర్ టీమ్. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 15 పరుగుల తేడాతో విజయం అందుకుంది. పృథ్వీ షాతో పాటు రిలే రసో హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా డేవిడ్ వార్నర్ 46 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 26 పరుగులు చేసి ఢిల్లీకి 213 పరుగుల భారీ స్కోరు అందించారు..

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, గత మ్యాచ్‌లో కేకేఆర్ చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌ గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి స్థానం నుంచి పైకి ఎగబాకుతుంది.. అదే జరిగితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌కి మొదటి క్వాలిఫైయర్ ఆడే ఛాన్సులు పెరుగుతాయి...

ఢిల్లీ క్యాపిటల్స్ నేటి మ్యాచ్‌లో చేతన్ సకారియాకి అవకాశం ఇచ్చి సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు విశ్రాంతినిచ్చింది. తుది జట్టులో లేని పృథ్వీ షా, తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడొచ్చు. 

సీజన్‌లో పెద్దగా మార్పులు చేయని చెన్నై సూపర్ కింగ్స్ నేటి మ్యాచ్‌లో కూడా గత మ్యాచ్ టీమ్‌ని కొనసాగించింది. 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్డ్, రిలే రసో, యష్ ధుల్, ఆమన్ హకీం ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ఆన్రీచ్ నోకియా

 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, అజింకా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహార్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ 

click me!