IPL 2023: కామెరూన్ గ్రీన్ పైసా వసూల్ ఇన్నింగ్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు..

Published : Apr 18, 2023, 09:13 PM ISTUpdated : Apr 18, 2023, 09:16 PM IST
IPL 2023: కామెరూన్ గ్రీన్ పైసా వసూల్ ఇన్నింగ్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు..

సారాంశం

IPL 2023: మొట్టమొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీ బాదిన కామెరూన్ గ్రీన్... 38 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, 37 పరుగులు చేసిన తిలక్ వర్మ.. 

ఐపీఎల్ 2023 వేలంలో రూ.17.5 కోట్ల భారీ ధర దక్కించుకున్న కామెరూన్ గ్రీన్, ఎట్టకేలకు పైసా వసూల్ ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ని ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ హాఫ్ సెంచరీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై ఇండియన్స్.. 

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్‌కి మంచి ఆరంభం దక్కింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి 4.4 ఓవర్లలో 41 పరుగులు జోడించారు.  18 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నటరాజన్ బౌలింగ్‌లో అయిడిన్ మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

అవుట్ అవ్వడానికి ముందు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదిన రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో 6 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 6844 పరుగులు చేసి టాప్‌లో ఉండగా శిఖర్ ధావన్ 6477, డేవిడ్ వార్నర్ 6109 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. 6 వేల  పరుగుల ఐపీఎల్‌ క్లబ్‌లో చేరిన నాలుగో బ్యాటర్ రోహిత్ శర్మ..

రోహిత్ శర్మ అవుటైన తర్వాత కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో అయిడిన్ మార్క్‌రమ్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. 

గత మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించిన సూర్యకుమార్ యాదవ్ 3 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..

17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసిన తిలక్ వర్మ, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొదటి 20 బంతుల్లో 21 పరుగులే చేసిన కామెరూన్ గ్రీన్, మెల్లిమెల్లిగా గేర్ మార్చాడు..

నటరాజన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 6 బాది 33 బంతుల్లో మొట్టమొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు కామెరూన్ గ్రీన్. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి స్కోరు వేగాన్ని కంట్రోల్ చేశాడు భువనేశ్వర్ కుమార్. ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన టిమ్ డేవిడ్, ముంబై ఇండియన్స్ స్కోరు 190 మార్కు దాటించాడు. 

కామెరూన్ గ్రీన్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా కాగా టిమ్ డేవిడ్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. 6 వేల ఐపీఎల్ పరుగులు అందుకునేందుకు డేవిడ్ వార్నర్ 4285 బంతులు తీసుకుంటే, విరాట్ కోహ్లీ 4595 పరుగులు వాడుకున్నాడు. రోహిత్ శర్మ 4616 బంతులు వాడి మూడో స్థానంలో నిలిచాడు. శిఖర్ ధావన్ 4738 బంతుల్లో 6 వేల ఐపీఎల్ పరుగులు అందుకుని నాలుగో స్థానంలో ఉన్నాడు..

ఇన్నింగ్స్‌ల పరంగా మాత్రం ఆలస్యంగా 6 వేల క్లబ్‌లో చేరిన బ్యాటర్ రోహిత్ శర్మ. డేవిడ్ వార్నర్ 165 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 6 వేల పరుగులు అందుకుని టాప్‌లో ఉంటే విరాట్ కోహ్లీ 188, శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు. కెరీర్ ఆరంభంలో లోయర్ ఆర్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ ఏకంగా 227 ఇన్నింగ్స్‌ల్లో 6 వేల క్లబ్‌లో చేరాడు..

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?