ఆస్ట్రేలియాకు పించ్.. టీమిండియాకు ఉనద్కత్.. ఐపీఎల్ లో ఈ ఇద్దరికీ అరుదైన ఘనత..

Published : Apr 02, 2023, 03:53 PM IST
ఆస్ట్రేలియాకు పించ్.. టీమిండియాకు ఉనద్కత్.. ఐపీఎల్ లో ఈ ఇద్దరికీ అరుదైన ఘనత..

సారాంశం

IPL 2023:  టీమిండియా  వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్  ఐపీఎల్  లో అరుదైన ఘనత అందుకున్నాడు.   ఆస్ట్రేలియా మాజీ సారథి ఆరోన్ ఫించ్ రికార్డుకు చేరువవుతున్నాడు. 

భారత  క్రికెట్ జట్టు పేసర్, దేశవాళీలో  సౌరాష్ట్రకు సారథిగా వ్యవహరిస్తూ  ఈ ఏడాది రంజీ ట్రోఫీ కూడా నెగ్గిన  జయదేవ్ ఉనద్కత్  ఐపీఎల్ లో అరుదైన ఘనతను అందుకున్నాడు.   ఈ వెటరన్ పేసర్  భారత మాజీ క్రికెటర్లు  పార్థీవ్ పటేల్, యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఊతప్ప లతో పాటు ప్రస్తుతం ఆర్సీబీకి ఆడుతున్న దినేశ్ కార్తీక్ రికార్డును కూడా  బ్రేక్ చేశాడు.  

ఐపీఎల్ లో  ఉనద్కత్..  శనివారం  లక్నో సూపర్  జెయింట్స్ తో  మ్యాచ్ లో బరిలోకి దిగాడు.  తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏడు ఫ్రాంచైజీల తరఫున   ప్రాతినిథ్యం వహించిన  ఆటగాడిగా  ఘనత సాధించాడు.   ఉనద్కత్  2010 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 

2010 ఐపీఎల్ సీజన్లో ఉనద్కత్.. కేకేఆర్ తరఫున ఆడాడు.  2012 వరకూ  కేకేఆర్ తోనే ఉన్నాడు.   2013లో అతడు ఆర్సీబీకి ఆడాడు.  2014 - 15 సీజన్లలో ఢిల్లీ  డేర్ డెవిల్స్ కు ఆడాడు.  ఇక 2017లో  ఉనద్కత్  రైజింగ్  పూణె సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.   

2018 సీజన్ లో ఉనద్కత్ ను  రాజస్తాన్ రాయల్స్.. ఏకంగా 11.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.   2021 వరకూ రాజస్తాన్ తోనే ఉన్న అతడు.. 2022 సీజన్ లో  ముంబై ఇండియన్స్ టీమ్ లో సభ్యుడిగా ఉన్నాడు.  2023 సీజన్ కు ముందు గత డిసెంబర్ లో జరిగిన ఐపీఎల్ వేలంలో  ఉనద్కత్ ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. ఈ సీజన్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో  ఉనద్కత్.. ఢిల్లీతో మ్యాచ్ లో ఆడాడు. తద్వారా ఏడు ఫ్రాంచైజీల తరఫున ఆడిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. 

 

ఐపీఎల్ లో ఆసీస్ మాజీ సారథి  ఆరోన్ ఫించ్.. ఏకంగా 9 ఫ్రాంచైజీలకు ఆడాడు.   ఫించ్.. రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, పూణె వారియర్స్, సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, కేకేఆర్ లకు ఆడాడు.  పించ్ ను ఒక సీజన్ లో ఆడించిన ఏ ఫ్రాంచైజీ కూడా మళ్లీ అతడిని రిటైన్ చేసుకోలేదు.  

భారత మాజీ క్రికెటర్లు  పార్థీవ్ పటేల్, యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఊతప్ప లతో పాటు ప్రస్తుతం ఆర్సీబీకి ఆడుతున్న దినేశ్ కార్తీక్  లు ఐపీఎల్ లో ఆరు ఫ్రాంచైజీలకు ఆడారు.   ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిన్ నెహ్రా, ఎస్ఆర్హెచ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్,  జేసన్ హోల్డర్ లు ఐదు ఫ్రాంచైజీలకు ఆడారు.    

PREV
click me!

Recommended Stories

BCCI గ్రేడ్స్ అంటే ఏమిటి? భారత క్రికెటర్లు ఎంత సంపాదిస్తారు?
IPL 2026 : ఐపీఎల్‌లోకి ఏఐ ఎంట్రీ.. అంబానీ, ఆదానీ కాదు, ఈసారి గూగుల్ జెమినీ !