IPL 2022 PBKS vs GT: లియామ్ లివింగ్‌స్టోన్ ఒంటరిపోరు... గుజరాత్ టైటాన్స్ ముందు..

Published : Apr 08, 2022, 09:27 PM ISTUpdated : Apr 08, 2022, 09:30 PM IST
IPL 2022 PBKS vs GT: లియామ్ లివింగ్‌స్టోన్ ఒంటరిపోరు... గుజరాత్ టైటాన్స్ ముందు..

సారాంశం

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్... మూడు వికెట్లు తీసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్...

కెప్టెన్‌ మారినా పంజాబ్ కింగ్స్ ఆటతీరు మాత్రం ఏం మారలేదు. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ అదరగొడుతున్నా, అతనికి మరో ఎండ్ నుంచి సరైన సపోర్ట్ దొరకడం లేదు. మరో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది. అయితే మొత్తానికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేయగలిగింది పంజాబ్ కింగ్స్. 

15 ఓవర్లు ముగిసే సమయానికి 150+ పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ ఈజీగా 200+ స్కోరు చేసేలా కనిపించింది. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ముందు పరుగుల టార్గెట్ మాత్రమే పెట్టగలిగింది... కీలక దశలో కమ్‌బ్యాక్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ బౌలర్లు, పంజాబ్ కింగ్స్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించగలిగారు... 

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్. భనుక రాజపక్ష స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన జానీ బెయిర్ స్టో 8 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్ కలిసి మూడో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 30 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన శిఖర్ ధావన్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. యంగ్ బ్యాటర్ జితేశ శర్మ 11 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసి దర్శన్ నాల్కండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఓడియన్ స్మిత్‌ని అవుట్ చేశాడు నాల్కండే...

నాల్కండే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు స్మిత్. 27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు... 

లివింగ్‌స్టోన్‌ని అవుట్ చేసిన రషీద్ ఖాన్, అదే ఓవర్‌లో 8 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేసిన షారుక్ ఖాన్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కగిసో రబాడా కూడా రనౌట్ కావడంతో 153/5 పరుగుల వద్ద ఉన్న పంజాబ్ కింగ్స్, 1 పరుగు తేడాతో మూడు వికెట్లు కోల్పోయి 156/8 పరుగులకు చేరింది...

6 బంతుల్లో 2 పరుగులు చేసిన వైభవ్ అరోరాని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖర్లో రాహుల్ చాహార్ 14 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు, అర్ష్‌దీప్ సింగ్ 10 పరుగులు చేసి కొన్ని మెరుపులు మెరిపించడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది పంజాబ్ కింగ్స్. మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిన రషీద్ ఖాన్ నేటి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. 

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు
IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు