
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది... టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. పంజాబ్ కింగ్స్ ఓ మార్పుతో బరిలో దిగుతుంటే, గుజరాత్ టైటాన్స్ రెండు మార్పులు చేసింది. విజయ్ శంకర్, వరుణ్ అరోన్‌ల స్థానంలో సాయి సుదర్శన్, దర్శన్ నాల్కండే ఐపీఎల్ ఆరంగ్రేటం చేస్తున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలిసారి కెప్టెన్లుగా బాధ్యతలు తీసుకున్న హార్ధిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్ తొలి మ్యాచుల్లో మంచి విజయాలను అందుకున్నారు. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, పంజాబ్ కింగ్స్ తొలి విజయం అందుకుంటే... లక్నో సూపర్ జెయింట్స్‌ని చిత్తు చేసి గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది...
పంజాబ్ కింగ్స్ 3 మ్యాచుల్లో రెండు విజయాలు అందుకోగా, గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లోనూ అద్భుత విజయాలు అందుకుంది... కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనే హార్ధిక్ పాండ్యా మంచి ప్రశంసలు దక్కించుకుంటున్నాడు...
మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా తన కెప్టెన్సీ స్కిల్స్‌తో క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ని ఇంప్రెస్ చేశాడు. అయితే పంజాబ్ కింగ్స్‌కి ఫారిన్ ప్లేయర్ల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. శ్రీలంక ప్లేయర్ భనుక రాజపక్ష మొదటి మ్యాచుల్లో భారీ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి అదరగొట్టాడు రాజపక్ష...
అయితే జానీ బెయిర్‌స్టో రాకతో రాజపక్ష తుదిజట్టులో చోటు కోల్పోల్సి వస్తుంది. లియామ్ లివింగ్‌స్టోన్ గత మ్యాచ్‌లో అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో ఇరగదీశాడు. కగిసో రబాడా, ఓడియన్ స్మిత్ వంటి భారీ హిట్టింగ్ చేయగల బౌలర్లను తప్పించలేని పరిస్థితి.
పంజాబ్ కింగ్స్‌లో రాహుల్ చాహార్ గత మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి గుజరాత్ టైటాన్స్‌లోకి వచ్చిన రషీద్ ఖాన్... ఐపీఎల్ 2022 సీజన్‌లో తన మార్కు పర్పామెన్స్ ఇంకా ఇవ్వలేదు.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, ఓడియన్ స్మిత్, కగిసో రబాడా, రాహుల్ చాహార్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లూకీ ఫర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నాల్కండే