IPL 2022: ఆశల్లేని చోట అవకాశానికై పోరాటం.. ముంబైతో సన్ రైజర్స్ పోరు.. టాస్ నెగ్గిన రోహిత్ శర్మ

By Srinivas MFirst Published May 17, 2022, 7:09 PM IST
Highlights

IPL 2022 MI vs SRH: వరుసగా ఐదు మ్యాచులు గెలిచి తర్వాత అన్నే ఓటములతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు ముంబై ఇండియన్స్ తో తలపడుతున్నది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే హైదరాబాద్ కు ఎక్కడో ఓ మూల ప్లేఆఫ్ అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది. 
 

స్వీయ తప్పిదాలతో ఐపీఎల్-15 ప్లేఆఫ్ రేసునుంచి దాదాపు నిష్క్రమించే స్థితికి చేరుకున్న సన్ రైజర్స్ అవకాశాల సంగతి నేడు తేలనుంది. నేడు రాత్రి ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగిన  ముంబై ఇండియన్స్ తో తడబడనుంది. ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్  బౌలింగ్ ఎంచుకుంది. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని హైదరాబాద్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో ముంబైని ఓడిస్తే సన్ రైజర్స్ కు ప్లేఆఫ్ అవకాశాలు కొంతలో కొంతైనా మిగులుతాయి. 

ముంబై కి ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా పెద్దగా ఉపయోగం లేదు.  కానీ  ఆ జట్టు గెలుపు, ఓటములు ఇతర జట్లను ప్రభావం చేయగలుగుతాయి.ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడితే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే. 

పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉన్న ముంబై.. ఈ సీజన్ లో ఆడబోయే తదుపరి రెండు మ్యాచులలో అయినా విజయం సాధించి  గెలుపుతో సీజన్ ను ముగించాలని భావిస్తున్నది. అలా చేస్తే మిగతా జట్లకు కష్టమే.  ముంబై తమ తదుపరి మ్యాచ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడాల్సి ఉంది. 

ఇక సన్ రైజర్స్  విషయానికొస్తే.. ఆడిన 12 మ్యాచులలో 5 నెగ్గి ఏడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో నెగ్గకున్నా..  ముంబైతో పాటు పంజాబ్ లను కూడా ఓడించి పరువు దక్కించుకోవాలని భావిస్తున్నది.  

సన్ రైజర్స్ బ్యాటింగ్ విషయంలో  కేన్ విలియమ్సన్ ఫామ్ తీవ్ర ఆందోళనకరం.  ఈ సీజన్ లో అతడు చెత్త ఆటతీరుతో విసుగు తెప్పిస్తున్నాడు. అభిషేక్ శర్మ రాణిస్తున్నా.. కేన్ మామ మాత్రం విఫలమతున్నాడు. ఇక వన్ డౌన్ లో వచ్చే రాహుల్ త్రిపాఠి.. ఆ వెనకాలే వచ్చే మార్క్రమ్, నికోలస్ పూరన్ లు మరో భారీ ఇన్నింగ్స్ లు భాకీ ఉన్నారు. బౌలింగ్ లో సన్ రైజర్స్ గత మూడు మ్యాచులలో  కాస్త కుదుటపడింది.  

ముంబైలో రోహిత్ శర్మ చెత్త ఫామ్ ను కొనసాగిస్తుండగా ఇషాన్  కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. అతడికి  తోడు తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బ్యాటింగ్ లో ఈ ముగ్గురి మీదే ముంబై భారీ ఆశలు పెట్టుకుంది.  

ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు: 

ముంబై ఇండియన్స్‌:  రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రమన్దీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, సంజయ్ యాదవ్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్:  అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్,  భువనేశ్వర్ కుమార్, ఫరూఖీ, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

click me!