
గతేడాది ముగిసిన ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీల కొనుగోలు ప్రక్రియలో ఏకంగా రూ. 5 వేల కోట్లకు పైగా బిడ్ వేసి అహ్మదాబాద్ ను దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్ యాజమాన్యం ఈ సీజన్ లో సత్తా చాటాలని భావిస్తున్నది. తొలుత జట్టు మనుగడ (బెట్టింగ్ ఆరోపణలు)పై కొన్ని అనుమానాలు నెలకొన్నా తర్వాత బీసీసీఐ.. దానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టులోని కీలక సభ్యుడు హార్థిక్ పాండ్యా ను తమ సారథిగా ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ (జీటీ).. టీమిండియా మాజీ హెడ్ కోచ్, దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ ను మెంటార్ గా నియమించుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మాదిరిగానే భారీ ఆశలతో ఐపీఎల్ లో అడుగిడబోతున్న జీటీ.. సీజన్ లో తమ తొలి మ్యాచును ఆ జట్టుతోనే ఆడనుండటం గమనార్హం.
ఈనెల 28న వాంఖడే వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్ లో జీటీ.. ఎల్ఎస్జీని ఎదుర్కోనబోతున్నది. ఈ మేరకు సన్నాహకాలు కూడా ప్రారంభించింది. ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో ఆ జట్టు ఫుల్ షెడ్యూల్ ను ఇక్కడ అందిస్తున్నాం.
జీటీ ఫుల్ షెడ్యూల్ :
మార్చి 28 : జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖడే
ఏప్రిల్ 02 : జీటీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె
ఏప్రిల్ 08 : జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్
ఏప్రిల్ 11 : జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్
ఏప్రిల్ 14 : జీటీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్
ఏప్రిల్ 17 : జీటీ వర్సెస్ సీఎస్కే - సాయంత్రం 7.30 గంటలకు - పూణె
ఏప్రిల్ 23 : జీటీ వర్సెస్ కేకేఆర్ - మధ్యాహ్నం 3.30 గంటలకు - డీవై పాటిల్
ఏప్రిల్ 27 : జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖడే
ఏప్రిల్ 30 : జీటీ వర్సెస్ ఆర్సీబీ - మధ్యాహ్నం 3.30 గంటలకు - బ్రబోర్న్
మే 03 : జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్
మే 06 : జీటీ వర్సెస్ ఎంఐ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్
మే 10 : జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె
మే 15 : జీటీ వర్సెస్ సీఎస్కే - మధ్యాహ్నం 3.30 గంటలకు - వాంఖడే
మే 19 : జీటీ వర్సెస్ ఆర్సీబీ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖడే
రిటెన్షన్ ఆటగాళ్లు :
హార్థిక్ పాండ్యా (కెప్టెన్) (రూ. 15 కోట్లు), రషీద్ ఖాన్ (రూ. 15 కోట్లు), శుభమన్ గిల్ (రూ. 8 కోట్లు)
వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు :
మహ్మద్ షమీ (రూ. 6.25 కోట్లు), జేసన్ రాయ్ (రూ. 2 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ. 10 కోట్లు), అభినవ్ సదరంగని (రూ. 2.6 కోట్లు), రాహుల్ తెవాటియా (రూ. 9 కోట్లు), నూర్ అహ్మద్ (రూ. 30 లక్షలు), ఆర్. సాయి కిశోర్ (రూ. 3 కోట్లు), డొమినిక్ డ్రేక్స్ (రూ. 1.10 కోట్లు), జయంత్ యాదవ్ (రూ. 1.70 కోట్లు), విజయ్ శంకర్ (రూ. 1.40 కోట్లు), దర్శన్ నల్కందె (రూ. 20 లక్షలు), యశ్ దయాల్ (రూ. 3.20 కోట్లు), అల్జారి జోసెఫ్ (రూ. 2.40 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 3 కోట్లు), మాథ్యూ వేడ్ (రూ. 2.40 కోట్లు), వృద్ధిమాన్ సాహా (రూ.1.90 కోట్లు), గురుక్రీత్ సింగ్ (రూ. 50 లక్షలు), వరుణ్ ఆరోన్ (రూ. 50 లక్షలు)
కోచింగ్ సిబ్బంది :
- ఆశిష్ నెహ్రా : హెడ్ కోచ్
- గ్యారీ కిర్స్టెన్ : బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటార్
- ఆశిస్ కపూర్ : స్పిన్ బౌలింగ్ కోచ్ అండ్ స్కౌట్