అందుకే మురళీతో అలా చేశా.. కేకేఆర్ సారథిని బౌల్డ్ చేశాక సంబురాలపై సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ కామెంట్స్

Published : Apr 16, 2022, 11:41 AM IST
అందుకే మురళీతో అలా చేశా.. కేకేఆర్ సారథిని బౌల్డ్ చేశాక సంబురాలపై  సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్  కామెంట్స్

సారాంశం

TATA IPL 2022 - SRH vs KKR: ఐపీఎల్ లో శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ - కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్  ఉమ్రాన్ మాలిక్  కేకేఆర్ సారథిని బౌల్డ్ చేశాక డేల్ స్టెయిన్ సంబురాలు చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

వరుస విజయాలతో జోరు మీదున్న కోల్కతా నైట్ రైడర్స్ కు వరుసగా రెండో పరాజయాన్ని రుచి చూపుతూ సంచలన విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్.. ముందు బౌలింగ్ లో ప్రత్యర్థిని కట్టడి చేసి ఆ తర్వాత బ్యాటింగ్ లో చెలరేగింది.  అయితే  కోల్కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయస్ అయ్యర్ ను హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేయడం చర్చనీయాంశమైంది. 148 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన ఉమ్రాన్.. శ్రేయస్ కు క్లీన్ బౌల్డ్ చేసి హైదరాబాద్ కు బిగ్ బ్రేక్ ఇచ్చాడు. అయితే ఉమ్రాన్ వికెట్ తీయగానే  సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్  డగౌట్ లో ఎగిరి గంతేశాడు.  తన సహచరుడు, హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్  ముత్తయ్య మురళీధరన్ ను అభినందిస్తూ  సంబురాలు చేసుకున్నాడు. 

కోల్కతా ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అప్పటికే త్వరత్వరగా 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కేకేఆర్ కు శ్రేయస్ అయ్యర్ (28) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.  అప్పటికే క్రీజులో కుదురుకునేందుకు యత్నిస్తున్నాడు. ఆ సమయంలో   ఎస్ఆర్హెచ్ సారథి కేన్ విలియమ్సన్.. ఉమ్రాన్ కు బాల్ ఇచ్చాడు. 

బంతిని అందుకున్న ఉమ్రాన్.. ఆ ఓవర్ ఆరో  బాల్ కు అద్భుతమైన యార్కర్ తో శ్రేయస్ ను బోల్తా కొట్టించాడు.  అయితే శ్రేయస్ నిష్క్రమణకు ముందే సన్ రైజర్స్ డగౌట్ లో మరో స్టోరీ నడుస్తున్నది. డేల్ స్టెయిన్, టామ్ మూడీ (ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్)  లు కలిసి అయ్యర్ ను అడ్డుకునేదెలాగో ఆలోచిస్తున్నాం. ఆ క్రమంలోనే మురళీ (ముత్తయ్య మురళీధరన్)  ఉండి ఈ సమయంలో యార్కర్ వేస్తే బెటరని సూచించాడు. కానీ  స్టెయిన్, మూడీ మాత్రం దానికి వ్యతిరేక భావనలో ఉన్నారు. 

‘ఒకవేళ  ఉమ్రాన్ యార్కర్ వేస్తే  ఆ బంతిని శ్రేయస్.. ఫోర్ కొడతాడు’ అని స్టెయిన్ మురళీతో చెప్పగా దానికి  స్పిన్ మాంత్రికుడు మాత్రం ‘లేదు.. యార్కరే బెటర్’ అని తన వాదనను సమర్థించుకున్నాడు. 9 ఓవర్ ఆరో బంతికి ఉమ్రాన్ యార్కర్ వేశాడు. అయ్యర్ పక్కకు జరిగి ఆడాలనుకుని యత్నించాడు. కానీ బాల్ నేరుగా వెళ్లి వికెట్లకు తాకింది. అంతే డగౌట్ లో ఉన్న   స్టెయిన్ ఆనందం అంతా ఇంతా కాదు.  అయ్యర్ బౌల్డ్ కాగానే  తాను కూర్చున్న  కుర్చీలోంచి లేచి.. పక్కనే ఉన్న మురళీధరన్ ను అభినందించకుండా ఉండలేకపోయాడు. 

 

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  అయితే  మ్యాచ్ అనంతరం డగౌట్ లో జరిగిన పై  సంభాషణను  స్టెయిన్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.  మురళీ  స్పిన్ బౌలర్, కోచ్ అయినా ఫాస్ట్ బౌలర్ తో యార్కర్ వేయించాలని సూచించాడని, అతడో మేధావి అని కొనియాడాడు.

కాగా నిన్నటి మ్యాచ్ లో ఉమ్రాన్ ఎప్పటిలాగే బుల్లెట్ లాగా దూసుకొచ్చే బంతులతో చెలరేగాడు.  కాస్త పరుగులిచ్చుకుంటున్నప్పటికీ అతడు రాను రాను మెరుగవుతున్నాడని స్టెయిన్ కొనియాడాడు. ఉమ్రాన్ భవిష్యత్ లో భారత జట్టుకు ఆడతాడని, అతడు కీలక బౌలర్ గా ఎదుగుతాడని  స్టెయిన్ తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ తో మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన ఉమ్రాన్.. 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !