IPL 2020: విరాట్ కెప్టెన్సీకి పరీక్షగా ఐపీఎల్ టైటిల్...

By team teluguFirst Published Sep 16, 2020, 10:29 AM IST
Highlights

కోహ్లీ కెప్టెన్సీలో 2016లో ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత మూడు సీజన్లలోనూ ఘోరంగా విఫలమైంది.

2017లో,  2019లో ఆఖరి స్థానంలో నిలవగా 2018లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 

భారత జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో టీమిండియా 60 టెస్టు మ్యాచులాడి 27 విజయాలు సాధిస్తే, కోహ్లీ కెప్టెన్సీలో 55 మ్యాచులు ఆడి, 33 విజయాలు ఖాతాలో వేసుకుంది. అయితే ఐపీఎల్‌లో మాత్రం కోహ్లీ రికార్డు ఏ మాత్రం బాగోలేదు.

కోహ్లీ కెప్టెన్సీలో 2016లో ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత మూడు సీజన్లలోనూ ఘోరంగా విఫలమైంది. 2017లో,  2019లో ఆఖరి స్థానంలో నిలవగా 2018లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 
గత సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఘోరంగా ఓడింది కోహ్లీ సేన. మైదానంలోనే విరాట్ కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ సీజన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి పరీక్షగా మారనుంది. యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ, బెంగళూరు కంటే మెరుగ్గా ఆడుతోంది. విరాట్ సారథ్యంలో ఆర్‌సీబీ 110 మ్యాచులాడితే 55 మ్యాచుల్లో ఓడింది. 49 విజయాలు దక్కాయి. రెండు టై కాగా, మిగిలినవి ఫలితం తేలకుండానే రద్దయ్యాయి.

దీంతో ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ కప్పు గెలవకపోయినా, కనీసం ప్లే ఆఫ్ దశకైనా చేరుకోవాలి. లేకపోతే విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్రమైన విమర్శలు రావడం ఖాయం. కోహ్లీ కెప్టెన్సీలో భారత ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడంతో ఈ ఎఫెక్ట్, అక్కడ కూడా పడవచ్చు. 

click me!