IPL 2020: డ్యాన్సులు, పాటలు... ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ సేన!

Published : Sep 30, 2020, 05:18 PM IST
IPL 2020: డ్యాన్సులు, పాటలు... ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ సేన!

సారాంశం

ఏబీ డివిల్లియర్స్,దేవ్‌దత్ పడిక్కల్ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ ఫెయిల్... బౌలింగ్‌లోనూ ఘోరంగా విఫలమైన రాయల్ ఛాలెంజర్స్... ముంబైపై సూపర్ ఓవర్‌లో దక్కిన విజయాన్ని పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఆర్‌సీబీ...  

IPL 2020 సీజన్ 13లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు విజయాలు సాధించింది. గత సీజన్‌తో పోలిస్తే కాస్త మెరుగైన పర్ఫామెన్స్ ఇస్తోంది ఆర్‌సీబీ. అయితే బెంగళూరు జట్టులో యంగ్ బ్యాట్స్‌మెన్ దేవ్‌దత్ పడిక్కల్, ‘సూపర్ మ్యాన్’ ఏబీ డివిల్లియర్స్ తప్ప మిగిలిన వాళ్లు పెద్దగా రాణించడం లేదు. ముఖ్యంగా నిలకడకి మారుపేరైన విరాట్ కోహ్లీ... వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. మూడు మ్యాచుల్లో కలిపి 17 పరుగులే చేశాడు ‘కింగ్’ కోహ్లీ. ఇందులో ఓ డకౌట్ కూడా ఉంది.

అయితే ముంబై ఇండియన్స్‌తో దక్కిన విజయంతో పార్టీ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. స్విమ్మింగ్ పూల్‌లో వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేసిన ఆర్‌సీబీ టీమ్... పార్టీలో పాటలు పాడుతూ చిందులు వేశారు. రాయల్ ఛాలెంజర్స్ యజమాని విజయ్ మాల్వా ధోరణికి తగ్గట్టుగా ఎంజాయ్ చేసి, విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆర్‌సీబీ క్రికెటర్లు.

అయితే ప్రాక్టీస్ కూడా చేస్తే, ఆటతీరు కాస్త మెరుగవుతుందని అంటున్నారు అభిమానులు. ఏబీడీ లేకపోతే బెంగళూరు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ప్రాక్టీస్ పెంచాలని కామెంట్ చేస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తర్వాతి మ్యాచ్ ఆక్టోబర్ 3న ఆడనుంది. 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !