
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్ లో అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ సీజన్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్ మొదటిరోజే.. చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. శనివారం జరిగిన లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ముంబైపై సీఎ్‌సకే నెగ్గిన విషయం తెలిసిందే. ధోనీ సారథ్యంలో చెన్నైకిది వందో విజయం. దీంతో లీగ్ చరిత్ర లో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. 437 రోజుల తర్వాత క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ.. తమ తొలి మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ముందుగా బౌలర్లను, ఆ తర్వాత చేధనలో బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తూ చివరకు మ్యాచ్‌ను వశం చేసుకోగలిగాడు.
కాగా.. వికెట్ల వెనకాల అత్యంత చురుగ్గా ఉండే ఎంఎస్ టీ20 ఫార్మాట్‌లో 250 క్యాచ్‌లను అందుకున్న తొలి వికెట్ కీపర్‌గానూ నిలిచాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతను పొలార్డ్, క్రునాల్ క్యాచ్‌లను పట్టేశాడు.