IPL 2020: భజ్జీ లేడు, ధోనీ ఆశలన్నీ ఈ బౌలర్‌పైనే...

By team teluguFirst Published Sep 15, 2020, 3:16 PM IST
Highlights

భజ్జీ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కి ప్రధాన బలమైన స్పిన్ విభాగం బలహీనపడింది. 

హర్భజన్ సింగ్‌కి ప్రత్యామ్నాయంగా యంగ్ స్పిన్నర్లవైపు చూస్తున్న ధోనీ...

ఐపీఎల్‌ 13వ సీజన్ ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు ‘కూల్ కెప్టెన్’ మహేంద్ర సింగ్ ధోనీ. అయితే అప్పటినుంచి చెన్నై జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.

‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకోగా... సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పర్సనల్ రీజన్స్‌తో స్వదేశం చేరాడు. భజ్జీ తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఇండియాకు తిరిగొచ్చారు.


భజ్జీ లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్‌కి ప్రధాన బలమైన స్పిన్ విభాగం బలహీనపడింది. దీంతో యంగ్ స్పిన్నర్ దీపక్ చాహార్‌పై ఆశలన్నీ పెట్టుకున్నాడు ధోనీ. దుబాయ్ చేరిన కొన్నిరోజులకే కరోనా బారిన పడిన దీపక్ చాహార్, సీజన్‌లో ఎలా రాణిస్తాడనే అనుమానంగా మారింది.

దీపక్ చాహార్

ఇతనితో పాటు యంగ్ స్పిన్నర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా కరోనా బారిన పడి, క్వారంటైన్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన రుతురాజ్‌పైన కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది ధోనీ టీమ్.

click me!