ఐపిఎల్ 2019 ఫైనల్‌ హైదరాబాద్‌లోనే...కీలక మ్యాచులకు విశాఖ ఆతిథ్యం

By Arun Kumar PFirst Published Apr 22, 2019, 9:10 PM IST
Highlights

ఈ ఐపిఎల్ సీజన్ 12 తెలుగు క్రికెట్ ప్రియులను మరింత ఉర్రూతలూగించనుంది. ఇప్పటికే ఐపిఎల్ లీగ్ దశలో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. మరికొన్ని మ్యాచులు జరగాల్సి వుంది. వీటినే ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడంతో తెలుగు ప్రేక్షకులు సంబరపడిపోతుంటే తాజా వార్తతో వారి పరిస్థితి బూరెల బుట్టలో పడ్డట్లయింది. చెన్నై వేదికగా జరగాల్సిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కొన్ని కారణాలతో ఈ మ్యాచ్ ను చెన్నై నుండి తరలిస్తున్నట్లు ఐపిఎల్ అధికారులు చెబుతున్నారు. 

ఐపిఎల్ ప్రతి సంవత్సరం మాదిరిగానే గతేడాది విజేతగా నిలిచిన జట్టుకు సంబందించిన హోమ్ గ్రౌండ్ లో ఫైనల్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ లెక్కన ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానమైన చెపాక్‌ స్టేడియంలో ఫైనల్ జరగాలి. అయితే తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) చెపాక్‌లోని ఐ, జే, కే స్టాండ్స్ ను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంలేదు. దీంతో గతేడాది రన్నరప్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ సొంత మైదానం ఉప్పల్‌లో మ్యాచ్‌ నిర్వహించాలని ఐపీఎల్‌ నిర్వాహకులు నిర్ణయించినట్లు సమాచారం. 

ఇక హైదరాబాద్ లో జరగాల్సిన క్వాలిఫైయర్-2, ఎలిమినేషన్ మ్యాచులు సెక్యూరిటీ కారణాల రిత్యా విశాఖపట్నానికి తరలిపోనున్నాయి. మే 6, 10, 14తేదీల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సెక్యూరిటీ కారణాల రిత్యా ఈ మ్యాచులను విశాఖకు తరలిస్తున్నట్లు ఐపిఎల్ నిర్వహకులు తెలిపారు. మే 8 ఎలిమినేటర్‌, మే 10న క్వాలిఫయర్‌ 2 జరుగనున్నాయి. క్వాలికఫయర్-1 చెన్నైలోనే జరగనుంది.   
 
click me!