
వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. విండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది... ఇప్పటికే వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, టీ20 సిరీస్‌లోనూ ఆ ఫీట్‌ను రిపీట్ చేయాలని ఆశపడుతోంది...
వన్డే సిరీస్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల పర్ఫామెన్స్‌పైనే భారత జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది.
యజ్వేంద్ర చాహాల్‌తో పాటు రవి భిష్ణోయ్ స్పిన్నర్లుగా జట్టులో అవకాశం దక్కించుకుంటే, ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయబోతున్నాడు. భువనేశ్వర్ కుమార్‌తో పాటు దీపక్ చాహార్, హర్షల్ పటేల్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు...
వెస్టిండీస్ జట్టు: బ్రెండన్ కింగ్, కేల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, కిరన్ పోలార్డ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హుస్సేన్, ఓడియన్ స్మిత్, ఫ్యాబియన్ ఆలెన్, షెల్డన్ కాంట్రెల్
భారత జట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహార్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి భిష్నోయ్, యజ్వేంద్ర చాహాల్