INDvsSL 3rd ODI: టాస్ గెలిచిన టీమిండియా... సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం...

By Chinthakindhi RamuFirst Published Jan 15, 2023, 1:10 PM IST
Highlights

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... హార్ధిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్!  ఉమ్రాన్ మాలిక్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. 

శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా, సిరీస్‌ని సొంతం చేసుకుంది. టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయిన శ్రీలంక జట్టు, వన్డే సిరీస్‌లోనూ ఆఖరి వన్డే గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో గెలవడంతో మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలో దిగుతోంది...

తొలి రెండు వన్డేల్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించిన భారత జట్టు, నేటి మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది.  కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కి కూడా తుది జట్టులో చోటు దక్కింది. అలాగే శ్రేయాస్ అయ్యర్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా తుదిజట్టులోకి వచ్చాడు...

తొలి రెండు వన్డేల్లో ఆడిన వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తుదిజట్టులోకి రాగా ఉమ్రాన్ మాలిక్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కి అవకాశం కల్పించింది టీమిండియా.. 


భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి శ్రీలంకపై ఇది 50వ వన్డే మ్యాచ్. లంకపై 50కి పైగా వన్డేలు ఆడిన ఏడో భారత బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ.  ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (84 వన్డేలు), ఎమ్మెస్ ధోనీ (67), సురేష్ రైనా, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ (55 వన్డేలు), మహ్మద్ అజారుద్దీన్ (53 వన్డేలు) ఆడి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు. 

శ్రీలంక జట్టు కూడా మూడో వన్డేలో రెండు మార్పులతో బరిలో దిగుతోంది. ధనంజయ డి సిల్వ స్థానంలో అసెన్ బండారా తుది జట్టులోకి రాగా దునిత్ వెల్లలాగే స్థానంలో జెఫ్రే వందెర్సే టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.

శ్రీలంక జట్టు: ఆవిష్క ఫెర్నాండో, నువనిదు ఫెర్నాండో, కుశాల్ మెండీస్, అసెన్ బండారా, చరిత్ అసలంక, దసున్ శనక, వానిందు హసరంగ, జఫ్రే వందెర్సే, చమికా కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

click me!