టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ఆర్ పాటిల్ కన్నుమూత...

By team teluguFirst Published Sep 16, 2020, 1:46 PM IST
Highlights

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 36 మ్యాచులు ఆడిన పాటిల్, 1955లో భారత జట్టుకు ఎంపిక... భారత జట్టు తరుపున ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడిన పాటిల్.

భారత మాజీ క్రికెటర్ ఎస్ఆర్ పాటిల్, 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తన స్వగ్రామంలో నివాసం ఉంటున్న పాటిల్, రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచారు. పేస్ బౌలర్‌గా, ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పాటిల్ పూర్తిపేరు సదాశివ్ రావ్‌జీ పాటిల్. 

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 36 మ్యాచులు ఆడిన పాటిల్, 1955లో భారత జట్టుకు ఎంపికయ్యారు. 1955లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాటిల్, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు. ఆ మ్యాచ్‌లో పెద్దగా రాణించకపోవడంతో పాటిల్‌కి మరో అవకాశం రాలేదు.

రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహారించిన పాటిల్, 866 పరుగులు చేసి, 83 వికెట్లు తీశారు. పాటిల్‌కు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

click me!