ప్రపంచ కప్ నిబంధనల్లో మార్పులు...టీమిండియాకే అనుకూలం: యువరాజ్ సింగ్

By Arun Kumar PFirst Published May 27, 2019, 6:41 PM IST
Highlights

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ఈసారి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ కప్ టోర్నీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇదే అభిప్రాయాన్ని పలువురు టీమిండియాతో పాటు విదేశీ మాజీ దిగ్గజాలు వ్యక్తం చేశారు. తాజాగా ఐసిసి ప్రపంచ కప్ టోర్నీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేపట్టింది. అయితే ఈ నిబంధనలు కూడా భారత జట్టుకు  అనుకూలంగానే వున్నాయని...దీంతో టీమిండియా  ప్రపంచ కప్ అవకాశాలు మరింత పెరిగాయని సీనియర్ ప్లేయర్ యువరాజ్ అభిప్రాయపడ్డాడు. 
 
2011లో భారత జట్టు వన్డే ప్రపంచ కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన యువరాజ్ తాజా ప్రపంచ కప్ గురించి స్పందిచాడు. ఈ సందర్భంగా ఐసిసి నూతన నిబంధనల ప్రకారం మైదానంలో చోటుచేసుకునే మార్పుల గురించి...వాటి పరిణామాల గురించి వివరించాడు. '' గతంలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే 30 గజాల సర్కిల్ లో వుండేవారు. మిగతావారంతా సర్కిల్ బయట ఎక్కడైనా పీల్డింగ్ చేసే వెసులుబాటు వుండేది. అయితే తాజాగా ఈ సర్కిల్  లోపల తప్పకుండా ఐదుగురు ఫీల్డర్లు వుండాలని ఐసిసి కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీని వల్ల గతంలో మాదిరిగా 260-280 పరుగులు చేసి కాపాడుకునే పరిస్థితులు లేవని..కాబట్టి 300 పైచిలుకు స్కోరు సాధిస్తేనే గెలుపుపై ఆశలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నాడు. 

అయితే  టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని, పాండ్యా వంటి హిట్టర్లున్నారు. కాబట్టి ఈ ఐసిసి నిబంధన వల్ల భారత్ కు నష్టం కంటే లాభమే  ఎక్కువగా వుంది. కాబట్టి భారత జట్టు విజయావకాశాలు మరింత పెరుగయ్యాయి'' అని యువరాజ్  ఐసిసి నూతన నిబంధనల గురించి వివరించాడు.  
 
click me!