జోఫ్రా ఆర్చర్‌కి కౌంటర్ ఇచ్చిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్... రిప్లై ఇస్తే సిగరెట్ మానేస్తానని...

Published : Jun 17, 2022, 05:37 PM ISTUpdated : Jun 17, 2022, 05:55 PM IST
జోఫ్రా ఆర్చర్‌కి కౌంటర్ ఇచ్చిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్... రిప్లై ఇస్తే సిగరెట్ మానేస్తానని...

సారాంశం

విష్యవాణి ట్వీట్ల కారణంగా ‘జోఫ్రా బాబా’గా, ‘ఆర్చర్ బాబా’గా గుర్తింపు తెచ్చుకున్న జోఫ్రా ఆర్చర్... ఆర్చర్ రిప్లై కోసం అబద్దామాడి, కౌంటర్ ఇచ్చిన భారత క్రికెట్ ఫ్యాన్... 

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కొన్నాళ్లుగా గాయాలతో బాధపడుతూ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న జోఫ్రా ఆర్చర్, భవిష్యవాణి ట్వీట్ల కారణంగా ‘జోఫ్రా బాబా’గా, ‘ఆర్చర్ బాబా’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే ఊహించి ట్వీట్లు వేయడం ఆర్చర్ స్పెషాలిటీ. ప్రపంచంలో జరుగుతున్న ప్రతీ సంఘటన గురించి జోఫ్రా ఆర్చర్ వేసిన పాత ట్వీట్లు బయటికి వస్తూ, సంచలనం క్రియేట్ చేస్తూ ఉంటాయి...


ట్విట్టర్‌లో తెగ యాక్టీవ్‌గా ఉండే జోఫ్రా ఆర్చర్, ఇప్పటికే 41 వేలకు పైగా ట్వీట్లు వేశాడు. క్రికెట్‌తో పాటు రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సామాజిక విషయాలపై ట్విట్టర్‌లో స్పందిస్తూ ఉంటారు ఆర్చర్. అలాంటి జోఫ్రా ఆర్చర్‌కి ఊహించని పంచ్ ఇచ్చాడు భారత క్రికెట్ ఫ్యాన్స్...


జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ ట్వీట్‌కి స్పందించి వివేక్ గౌతమ్ అనే నెటిజన్, ‘ఒక్క రిప్లే ఇస్తే, సిగరెట్ తాగడం మానేస్తానంటూ...’ కామెంట్ చేశాడు.. ఈ కామెంట్‌కి ‘టైమ్ టు క్విట్’ (వదిలేయాల్సిన సమయం వచ్చింది) అంటూ సమాధానం ఇచ్చాడు...

జోఫ్రా ఆర్చర్ రిప్లై ఇవ్వడంతో ఉప్పొంగిపోయిన సదరు నెటిజన్, ‘నిజం చెప్పాలంటే నేనెప్పుడూ సిగరెట్ తాగడం మొదలెట్టనే లేదు..’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీల ట్వీట్లపై స్పందిస్తూ, వారికి వ్యంగ్యంగా సమాధానాలు ఇవ్వడం జోఫ్రా ఆర్చర్‌కి అలవాటు. అలాంటి ఆర్చర్‌కే కౌంటర్ ఇవ్వడంతో సదరు భారత క్రికెట్ ఫ్యాన్‌‌కి మంచి పాపులారిటీ వచ్చేసింది...

27 ఏళ్ల జోఫ్రా ఆ్చర్, 2019లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. 13 టెస్టులు, 17 వన్డేలు, 12 టీ20 మ్యాచులు మాత్రమే ఆడిన జోఫ్రా ఆర్చర్, తన బౌలింగ్ యాక్షన్ కారణంగా బీభత్సమైన పాపులారిటీ, క్రేజ్ దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 86 వికెట్లు తీసిన జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరుపున మూడు సీజన్లు ఆడాడు...

గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరమైన జోఫ్రా ఆర్చర్‌ని, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2022 సీజన్‌కి ఆర్చర్ అందుబాటులో ఉండడని తెలిసినా, అతని కోసం రూ.8 కోట్లు పెట్టిన ముంబై, మరో స్టార్ పేసర్‌ని కొనుగోలు చేయకపోవడం ఆ టీమ్ పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే చెత్త ప్రదర్శనను మూటకట్టుకుంది... వచ్చే సీజన్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులోకి వస్తాడని ముంబై ఇండియన్స్ భారీ ఆశలే పెట్టుకుంది. అయితే గాయం తిరగబెట్టడంతో క్రికెట్ దూరమైన ఆర్చర్, వచ్చే సీజన్‌లో అయినా ఐపీఎల్ ఆడతాడా? అనేది అనుమానంగా మారింది... 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది