India vs South Africa: రెచ్చిపోయిన భార‌త బౌల‌ర్లు.. 55 ప‌రుగుల‌కే సౌతాఫ్రికా ఆలౌట్

By Mahesh RajamoniFirst Published Jan 3, 2024, 3:53 PM IST
Highlights

South Africa vs India, 2nd Test Live: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జ‌రుగుతున్న భార‌త్-సౌతాఫ్రికా రెండో టెస్టులో భార‌త బౌల‌ర్లు అద‌ర‌గొట్టడంతో 55 ప‌రుగుల‌కే ద‌క్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. మ‌హ్మ‌ద్ సిరాజ్ 6 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
 

South Africa vs India, 2nd Test: భార‌త్ vs ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా బుధ‌వారం రెండో టెస్టు ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో భార‌త బౌల‌ర్లు అద‌ర‌గొట్టారు. బౌల‌ర్ల‌కు అనుకూలించే ఈ పిచ్ పై నిప్పులు చెరిగారు. దీంతో సౌతాఫ్రికా జ‌ట్టు 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. మ‌హ్మ‌ద్ సిరాజ్ 6 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ లు చెరో రెండు వికెట్లు తీశారు. తొలి రోజు లంచ్ సమయానికి సిరాజ్ భార‌త్ కు మంచి ఫ‌లితాన్ని అందించాడు.

సెంచూరియన్ లో బాక్సింగ్ డేలో ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఓడిపోయిన భార‌త జ‌ట్టు.. రెండో  టెస్టును ఎలాగైనా గెల‌వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే భార‌త బౌల‌ర్లు తొలిరోజు బాగా రాణించారు. 9 ఓవర్లు వేసిన మ‌హ్మ‌ద్ సిరాజ్ 15 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. ఆతిథ్య జట్టు 55 పరుగులకే ఆలౌటైంది. తన చివరి టెస్టులో టాస్ గెలిచిన ఎల్గర్.. మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్ మ్యాజిక్ స్పెల్ వేయడంతో సౌతాఫ్రికాకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. స్వింగ్, సీమ్, కచ్చితత్వంతో బౌలింగ్ వేసి సౌతాఫ్రికా ప‌త‌నాన్ని సిరాజ్ శాసించాడు.

Latest Videos

డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రేన్నేలు మిన‌హా సౌతాఫ్రికా ప్లేయ‌ర్లు అంద‌రూ సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. త‌న అద్భుత బౌలింగ్ తో సిరాజ్ 6 వికెట్లు తీసుకున్నాడు. తొలి సెష‌న్ లో ఏడు ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకున్న సిరాజ్.. రెండో సెష‌న్ లో మూడు వికెట్లు తీశాడు. ఐడెన్ మార్క్‌రమ్, డీన్ ఎల్గ‌ర్, టోనీ డి జోర్జీ, డేవిడ్ బెడింగ్‌హామ్, మార్కో జాన్సెన్,  కైల్ వెర్రేన్నేల‌ను సిరాజ్ ఔట్ చేశాడు. అలాగే, భార‌త సేస‌ర్ జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. టార్గెట్ ఐపీఎల్ 2024 టైటిల్ !

click me!