INDvsSA 3rd Test: కేప్‌టౌన్‌లో టీమిండియాలో షాక్... సిరీస్ సౌతాఫ్రికా సొంతం...

By Chinthakindhi RamuFirst Published Jan 14, 2022, 5:19 PM IST
Highlights

India vs South Africa: 7 వికెట్ల తేడాతో కేప్ టౌన్ టెస్టులో టీమిండియా ఓటమి... 2-1 తేడాతో టెస్టు సిరీస్ కైవసం...

సఫారీ గడ్డపై సిరీస్ గెలవాలనే టీమిండియా ఆశలు నెరవేరలేదు. భారత జట్టు విధించిన 212 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఎలాంటి ఇబ్బంది పడని సౌతాఫ్రికా, 7 వికెట్ల తేడాతో మూడో టెస్టులో విజయాన్ని అందుకుని, 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు 140+ టార్గెట్‌ను పెట్టిన తర్వాత ఓడిపోవడం ఇదే తొలిసారి. 

ఓవర్‌నైట్ స్కోర్ 101/2 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికాకి మంచి ఆరంభం దక్కింది. కీగన్ పీటర్సన్, వాన్ దేర్ దుస్సేన్ కలిసి మూడో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

113 బంతుల్లో 10 ఫోర్లతో 82 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు శార్దూల్ ఠాకూర్. అయితే అప్పటికే విజయానికి 66 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితికి చేరుకుంది సౌతాఫ్రికా... మూడో వికెట్ పడిన తర్వాత కూడా వాన్ దేర్ దుస్సేన్, తెంబ భవుమా కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ని ముగించారు... 

రస్సే వాన్ దుస్సేన్ 95 బంతుల్లో 3 ఫోర్లతో 41 పరుగులు, తెంబ భవుమా 58 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.  అంతకుముందు 212 పరగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికా 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 22 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ను మహ్మద్ షమీ అవుట్ చేశాడు... 

అదే ఓవర్‌లో డీన్ ఎల్గర్ ఇచ్చిన అందుకోవడంలో విఫలమయ్యాడు పూజారా. లేకపోతే వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయేది సఫారీ జట్టు... డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ కలిసి రెండో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, జట్టును పటిష్ట స్థితికి చేర్చారు... 96 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేసిన డీన్ ఎల్గర్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

అంతకుముందు జట్టు స్కోరు 60 పరుగులు ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు అంపైర్... అయితే వెంటనే డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టుగా చూపించింది...

బేసిక్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఎవ్వరికైనా ఆ బంతి వికెట్లను తాకుతుందని తెలుస్తుంది. కనీసం అంపైర్ కాల్స్‌గా అయినా అవుతుందని అర్థం అవుతుంది... దీంతో కాసేపు హై డ్రామా నడిచింది. 

click me!