IND vs PAK Asia Cup 2025 Super Fours Live :

12:03 AM (IST) Sep 22
ఆసియా కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్ 4 లో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్ లోనే పాకిస్తాన్ ను టీమిండియా రెండో సారి ఓడించింది. భారత ప్లేయర్లను రెచ్చగొడితే ఎలా ఉంటుందో పాక్ బౌలర్లకు మనోళ్లు చూపించారు. 18.5 ఓవర్లలో 174/4 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
11:47 PM (IST) Sep 21
భారత్ నాల్గో వికెట్ కోల్పోయింది. సంజూ శాంసన్ 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
IND 148/4 (16.4) CRR: 8.88 REQ: 7.2
11:25 PM (IST) Sep 21
అభిషేక్ శర్మ 74 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.
IND 123/3 (12.2) CRR: 9.97 REQ: 6.39
11:15 PM (IST) Sep 21
భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సూర్య కుమార్ యాదవ్ జీరోకే అవుట్ అయ్యాడు.
11:11 PM (IST) Sep 21
భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. గిల్ 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
IND 105/1 (9.5) CRR: 10.68 REQ: 6.59
11:03 PM (IST) Sep 21
ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత్ 100 పరుగులు పూర్తి చేసింది. పాక్ ను గిల్, అభిషేక్ దంచికొడుతున్నారు.
IND 101/0 (9) CRR: 11.22 REQ: 6.45
10:58 PM (IST) Sep 21
అభిషేక్ శర్మ సునామీ బ్యాటింగ్ కొనసాగుతోంది. పాక్ బౌలింగ్ ను దంచికొడుతూ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
IND 97/0 (8.1) CRR: 11.88 REQ: 6.34
10:45 PM (IST) Sep 21
5 ఓవర్ల తర్వాత భారత్ 55 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ 28* రన్స్
గిల్ 27* రన్స్
IND 55/0 (5) CRR: 11 REQ: 7.8
10:37 PM (IST) Sep 21
పాకిస్తాన్ బౌలింగ్ ను భారత ఓపెనర్లు దంచికొడుతున్నారు. శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తున్నారు.
IND 43/0 (4) CRR: 10.75 REQ: 8.06
10:01 PM (IST) Sep 21
పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. భారత్ ముందు 172 పరుగుల టార్గెట్ ను ఉంచింది. పర్హాన్ 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
పాకిస్తాన్ 171/5 (20 ఓవర్లు)
09:41 PM (IST) Sep 21
పాకిస్తాన్ మళ్లీ దూకుడు పెంచింది. ప్రస్తుతం 137 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
PAK 137/4 (17.2) CRR: 7.9
09:20 PM (IST) Sep 21
పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో హుస్సేన్ అవుట్ అయ్యాడు.
PAK 113/3 (13.2) CRR: 8.48
09:08 PM (IST) Sep 21
అభిషేక్ శర్మ సూపర్ క్యాచ్ పట్టాడు. సామ్ అయూబ్ 17 బంతులలో 21 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. శివమ్ దుబే బౌలింగ్ లో అతను ఇచ్చిన క్యాచ్ ను పరుగెత్తుకుంటూ వచ్చి అభిషేక్ పట్టాడు.
PAK 100/2 (11.2) CRR: 8.82
08:40 PM (IST) Sep 21
పవర్ ప్లే పూర్తయింది. పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది.
PAK 55/1 (6) CRR: 9.17
08:34 PM (IST) Sep 21
ఐదో ఓవర్ల తర్వాత పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 42 పరుగులు చేసింది.
PAK 42/1 (5) CRR: 8.4
ఫర్హాన్ 20 పరుగులు*
సైమ్ 5 పరుగులు*
08:33 PM (IST) Sep 21
వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఫర్హాన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను కుల్దీప్ యాదవ్ మిస్ చేశాడు. అంతకుముందు, అభిషేక్ శర్మ కూడా క్యాచ్ ను మిస్ చేశాడు.
PAK 42/1 (5) CRR: 8.4
08:19 PM (IST) Sep 21
పాకిస్తాన్ మొదటి వికెట్ ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ తో ఫఖర్ జమాన్ (15 పరుగులు) అవుట్ అయ్యాడు. సంజూ క్యాచ్ రూపంలో చిక్కాడు.
PAK 21/1 (2.3) CRR: 8.4
08:17 PM (IST) Sep 21
ఃహార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్ బిగ్ షాట్ ఆడాడు. అయితే, థర్డ్ మ్యాన్ వద్ద అభిషేక్ శర్మ ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు.
07:41 PM (IST) Sep 21
పాకిస్తాన్ ప్లేయింగ్ 11
07:39 PM (IST) Sep 21
భారత్ ప్లేయింగ్ 11
07:31 PM (IST) Sep 21
భారత్ టాస్ గెలిచింది. భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాక్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
07:31 PM (IST) Sep 21
భారత క్రికెట్ జట్టు ఆదివారం (సెప్టెంబర్ 21) ఆసియా కప్ 2025లో సూపర్-4 రౌండ్‌లో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్‌తో ఈ మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్‌ను ఘోరంగా ఓడించింది. ఇప్పుడు టోర్నమెంట్‌లో సల్మాన్ అలీ ఆఘా జట్టును రెండోసారి ఓడించాలని చూస్తోంది.
ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇంకా ఓడిపోలేదు. భారత్‌ను ఓడించడం దాదాపు అసాధ్యం అనిపిస్తోంది, కానీ క్రికెట్‌లో ఏదైనా జరగవచ్చు. భారత బ్యాటింగ్ లైనప్ పూర్తి ఫామ్‌లో ఉంది, అలాగే ముగ్గురు అద్భుతమైన స్పిన్నర్లు, జస్ప్రీత్ బుమ్రాతో కూడిన బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కష్టంగా ఉంది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడినందున అక్షర్ పటేల్ పాకిస్తాన్‌తో ఆడటంపై కొంత సందేహం ఉంది.